Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

1200లకు దిగొచ్చిన కరోనా కొత్త కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గుముఖంపడుతోంది. తాజాగా 6.24 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1,233 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయ్యింది. గత కొద్దిరోజులుగా కొత్త కేసులు రెండువేలకు దిగువకు, పాజిటివిటీ రేటు ఒక శాతం లోపునే నమోదవుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 31 మంది మరణించారు. ఇప్పటివరకు మొత్తం కేసులు 4,30,23,215కు చేరగా, 5,21,101 మంది బాధితులు మృతిచెందారు. ఇప్పటివరకు 4,24,87,410 మంది కోలుకున్నారు. మరో 14,704 మంది చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో 1876 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.03 శాతం మాత్రమే ఉన్నాయని, రికవరీ రేటు 98.75 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉందని తెలిపింది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 0.20 శాతమని చెప్పింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,83,82,41,743 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని, ఇందులో మంగళవారం ఒక్కరోజే 26,34,080 మందికి వ్యాక్సినేషన్‌ చేశామని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img