Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రత్యేక అతిథులుగా భారత ఒలింపిక్స్‌ బృందం

ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత క్రీడాకారుల బృందానికి స్వదేశంలో అరుదైన గౌరవం దక్కనుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రత్యేక అతిథులుగా ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్లను ప్రధాని మోదీ దిల్లీలోని ఎర్రకోటకు ఆహ్వానించనున్నారు. ఆ రోజున వారందరితో వ్యక్తిగతంగా మోదీ భేటీకానున్నట్లు తెలుస్తోంది.సుమారు 127 మంది అథ్లెట్లు వివిధ ఈవెంట్లలో పాల్గొంటున్నారు. వీరితోపాటు వంద మంది కోచ్‌లు, అసిస్టెంట్‌ సిబ్బంది ఉన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో పురుషుల హాకీ సెమీఫైనల్స్‌ బెల్జియం చేతిలో భారత జట్టు పరాజయం పొందింది. అయితే గెలుపోటములు మన జీవితంలో భాగమేనని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.
ఈ ఒలింపిక్స్‌లో ప్రతి ఆటలోనూ భారత ఆత్మవిశ్వాసం కనిపించిందని పేర్కొన్నారు. మన ఆటగాళ్లు తమకన్నా మేటి ర్యాంకులో ఉన్నవారి పోరాడుతున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img