Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

15 నుంచి18 ఏళ్ల వారికి కొవిడ్‌ టీకా పంపిణీ ప్రారంభం

దేశవ్యాప్తంగా నేటి నుంచి పిల్లలకు 15 నుంచి 18 ఏళ్లలోపు వారికి కరోనా టీకా పంపిణీ ప్రారంభమైంది. ఈ వయసు వారికి వ్యాక్సినేషన్‌ కోసం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం నుంచి వ్యాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్‌ మొదలు పెట్టారు. కొవిన్‌ వెబ్‌సైట్‌లో 15 ఏళ్ల నుంచి 18ఏళ్లలోపు వారు రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్‌ కార్యక్రమం మొదలు పెట్టిన 36 గంటల్లోనే భారీ సంఖ్యలో టీనేజన్లు రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. జనవరి 2వ తేదీ మధ్యాహ్నం వరకూ 4.5 లక్షల మందికి పైగా యువతీ యువకులు వ్యాక్సిన్‌ కోసం విన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రర్‌ చేసుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.కేంద్రం అందించిన మార్గదర్శకాల ప్రకారం 15 నుంచి 18 ఏళ్లలోపు వయస్సు గల పిల్లలకు మాత్రమే కోవాక్సిన్‌ ఇవ్వనున్నారు. ఇందుకోసం కోవిన్‌ యాప్‌లో రిజిస్టర్‌ చేసుకోవచ్చని కోవిన్‌ ప్లాట్‌ఫాం చీఫ్‌ డా.ఆర్‌.ఎస్‌.శర్మ తెలిపారు. రిజిస్ట్రేషన్‌ కోసం 10వ తరగతి ఐడీ కార్డు కూడా గుర్తింపు కోసం పరిగణిస్తామని డాక్టర్‌ ఆర్‌ఎస్‌ శర్మ చెప్పారు. ఎందుకంటే కొంతమంది విద్యార్థులకు ఆధార్‌ కార్డు లేదా మరే ఇతర గుర్తింపు కార్డు ఉండకపోవచ్చనే దానిపై ఇలాంటి మార్పు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.
టీకా నమోదు ప్రక్రియకు..

  1. ముందుగా కోవిన్‌ యాప్‌కి వెళ్లాలి. మీ మొబ్కెల్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేయండి. ఓటీపీని నమోదు చేయడం ద్వారా లాగిన్‌ అవ్వొచ్చు.
  2. ఇప్పుడు ఆధార్‌ కార్డ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌ కార్డ్‌, పాస్‌పోర్ట్‌, పెన్షన్‌ పాస్‌బుక్‌, ఎన్‌పీఆర్‌ స్మార్ట్‌ కార్డ్‌, ఓటర్‌ ఐడీ, యునిక్‌ డిసేబిలిటీ ఐడి లేదా రేషన్‌ కార్డ్‌ నుంచి ఏదైనా ఒక ఫోటో ఐడీ ప్రూఫ్‌ని ఎంచుకోవాలి.
  3. మీరు ఎంచుకున్న ఐడీ నంబర్‌, పేరు నమోదు చేయండి. అప్పుడు లింగం, పుట్టిన తేదీని ఎంచుకోవాలి.
  4. సభ్యుడిని జోడిరచిన తర్వాత, మీరు మీ సమీప ప్రాంతం పిన్‌ కోడ్‌ను నమోదు చేయాలి. అప్పుడే టీకా వేసే కేంద్రాల జాబితా వస్తుంది.
  5. ఇప్పుడు టీకా తేదీ, సమయం, టీకాను ఎంచుకోవాలి. కేంద్రానికి వెళ్లి టీకాలు వేయించుకోవాలి.
  6. టీకా కేంద్రంలో, మీరు రిఫరెన్స్‌ ఐడీ, రహస్య కోడ్‌ను అందించాలి. అలాగే మీ లాగిన్‌కి ఇతర సభ్యులను జోడిరచడం ద్వారా మీ టీకాలను నమోదు చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img