Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

15-18 ఏళ్ల టీనేజర్లకు టీకా..

జనవరి 1 నుంచి కొవిన్‌లో రిజిస్ట్రేషన్‌
కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో 15`18 ఏళ్ల మధ్య వయసు వారికి కరోనా వ్యాక్సిన్‌లను అందించేందుకు కేంద్రం ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ వయసు వారికి జనవరి 1 నుంచి కొవిన్‌ యాప్‌, వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవనున్నట్లు సోమవారం వెల్లడిరచింది. ఇప్పటివరకు 18 ఏళ్లకు పైబడిన వారికి వాత్రమే వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. ఈ క్రమంలో 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లు ఉన్న వారికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నామని.. ఆ దిశగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. . దీనిలో భాగంగా సోమవారం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 15 నుంచి 18 ఏళ్ల టీనేజర్లు వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకునే ఏర్పాట్లు చేసినట్లు కోవిన్‌ ప్లాట్‌ఫామ్‌ చీఫ్‌ డాక్టర్‌ ఆర్‌ఎస్‌ శర్మ తెలిపారు. వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ను స్టూడెంట్‌ ఐడీ కార్డుతో చేసుకునేలా వెసులుబాటు కల్పించినట్లు డాక్టర్‌ శర్మ తెలిపారు. కోవిన్‌ ప్లాట్‌ఫామ్‌లో అదనంగా టెన్త్‌ ఐడీ కార్డు రిజిస్ట్రేషన్‌ను యాడ్‌ చేసినట్లు ఆయన వివరించారు. ఆధార్‌ కార్డు లేని వారికి ఈ ఆప్షన్‌ వర్తింస్తుందని.. అందరూ గమనించాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ అనంతరం 15-18 ఏళ్ల టీనేజర్లకు వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు.జనవరి 3 నుంచి డోసుల పంపిణీ చేపట్టనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img