Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

150 కోట్లు దాటిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ

దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ జోరుగా కొనసాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం సమయానికి దేశవ్యాప్తంగా 150.06 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేశారు.టీకా పంపిణీలో 150 కోట్ల మైలురాయిని దాటినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడిరచారు. పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో గల ఛిత్తరంజన్‌ నేషనల్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ రెండో క్యాంపస్‌ను ప్రధాని నేడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, భారత్‌ ఈరోజు మరో చారిత్రక మైలురాయిని అధిగమించిందని తెలిపారు. ఇప్పటివరకు దేశంలో 150 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు తెలిపారు. టీకాలకు అర్హులైన వారిలో 90 శాతానికి పైగా ప్రజలు తొలి డోసు అందుకున్నారని చెప్పారు. 15`18 ఏళ్ల వయసు వారికి టీకా పంపిణీ కూడా శరవేగంగా కొనసాగుతోందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img