Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

18 రోజుల్లో 8 ఘటనలు..

వివరణ కోరుతూ స్పైస్‌ జెట్‌కు డీజీసీఏ నోటీసులు జారీ
ప్రైవేటు విమానయాన సంస్ధ స్పైస్‌ జెట్‌ వరుస సమస్యలతో అభాసుపాలవుతోంది. స్పైస్‌ జెట్‌ విమానాల్లో వరుసగా లోపాలు తలెత్తడం ప్రయాణికులను గందరగోళానికి గురిచేస్తోంది. నిన్న ఈ సంస్థకు చెందిన రెండు విమానాల్లో సాంకేతిక సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. తాజాగా స్సైస్‌ జెట్‌ విమానం ఒకటి సాంకేతిక లోపంతో కోల్‌కతా వెనుదిరిగింది. ఈ ఘటన కూడా నిన్నే జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరుస సాంకేతిక సమస్యల నేపథ్యంలో డీజీసీఏ సీరియస్‌ అయింది. స్పైస్‌ జెట్‌ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసింది. వరుస ఘటనలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జూలై 5న స్పైస్‌జెట్‌ చైనాకు వెళ్లే విమానాల్లో ఒకదానిలో వాతావరణ రాడార్‌ సరిగా పనిచేయకపోవడంతో మరో సాంకేతిక సమస్యతో దెబ్బతినడంతో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. జూలై 5న స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్‌ 737 ఫ్రైటర్‌ (కార్గో ఎయిర్‌క్రాఫ్ట్‌) కోల్‌కతా నుండి చాంగ్‌కింగ్‌కు వెళ్లాల్సి ఉంది. టేకాఫ్‌ తర్వాత, వాతావరణ రాడార్‌ పని చేయడం ఆగిపోయింది. దాని తర్వాత పైలట్‌ కోల్‌కతాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కోల్‌కతాలో విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయిందని స్పైస్‌జెట్‌ ప్రతినిధి తెలిపారు. అదే రోజు తెల్లవారుజామున, స్పైస్‌జెట్‌ విమానం పాకిస్తాన్‌లోని కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో సూచిక లైట్‌ సరిగా పనిచేయకపోవడంతో సాధారణ ల్యాండిరగ్‌ చేసింది. దిల్లీ నుంచి దుబాయ్‌ వెళ్లే విమానం కరాచీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యిందని, ఎలాంటి ఎమర్జెన్సీ ప్రకటించలేదని స్పైస్‌జెట్‌ తెలిపింది.జూలై 2న, జబల్‌పూర్‌కు వెళ్తున్న స్పైస్‌జెట్‌ విమానం 5,000 అడుగుల ఎత్తులో క్యాబిన్‌లో పొగలు రావడంతో సిబ్బంది తిరిగి దిల్లీకి చేరుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img