ఆరు లక్షల మందికి ఉపాధి
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడి
విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: రాష్ట్రంలో 20 రంగాల్లో 340 మంది పెట్టుబడిదారులు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. విశాఖ ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ శిఖరాగ్ర సదస్సులో శుక్రవారం సీఎం జగన్ ప్రసంగించారు. తొలి రోజు 92 ఎంఓయూల ద్వారా రూ.11,87,756 కోట్ల ఒప్పందాలు జరిగినట్లు వివరించారు. పారిశ్రామిక దిగ్గజాలు ముఖేశ్ అంబానీ, గ్రంధి మల్లికార్జునరావు, కుమార మంగళం బిర్లా, సంజీవ్ బజాజ్, కరణ్ అదానీ, అర్జున్ ఒబెరాయ్, సజ్జన్ జిందాల్, నవీన్ జిందాల్, మార్జిన్ ఎబర్‌హర్డర్, హరి మోహన్ బంగూర్, సజ్జన్ భజంకా, కృష్ణ ఎల్లా, ప్రీతారెడ్డి, బీవీ మోహన్‌రెడ్డి తదితరులు రాష్ట్రంలో తమ సంస్థల కార్యకలాపాలు తెలిపారు. కొంతమంది వేదికపైనా ఎంతమేరకు పెట్టుబడులు పెడతారో ప్రకటించారు.
తొలి రోజు ఎంఓయూలు
ఎన్టీపీసీ(రూ.2.35 లక్షల కోట్లు), ఏబీసీ లిమిటెడ్ (రూ.1.20 లక్షల కోట్లు), రెన్యూ పవర్ (రూ.97,550 కోట్లు), ఇండోసాల్ (రూ.76,033 కోట్లు), ఏసీఎంఈ (రూ.68, 976 కోట్లు), టీఈపీఎస్‌ఓఎల్ (రూ.65,000 కోట్లు), జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ (రూ.50,632 కోట్లు), అవదా గ్రూప్ (రూ.50 వేల కోట్లు), హంచ్ వెంచర్స్(రూ.50 వేల కోట్లు), గ్రీన్ కో(రూ.47,600 కోట్లు), ఓసీఐఓఆర్ (రూ.40 వేల కోట్లు), హీరో ఫ్యూచర్స్ ఎనర్జీస్ (రూ.30 వేల కోట్లు), వైజాగ్ టెక్ పార్క్ (రూ.21,844 కోట్లు), అదానీ గ్రీన్ ఎనర్జీ గ్రూపు (రూ.21,820 కోట్లు), ఎకో రన్ ఎనర్జీ (రూ.15,500 కోట్లు), సెరెంటికా (రూ.12,500 కోట్లు), ఎన్‌హెచ్‌పీసీ(రూ.12 వేల కోట్లు), అరబిందో గ్రూప్ (రూ.10,365 కోట్లు), వోటు పవర్ (రూ.10 వేల కోట్లు), ఏజీపీ సిటీ గ్యాస్ (రూ.10 వేల కోట్లు), జేసన్ ఇన్‌ఫ్రా(రూ.10 వేల కోట్లు), ఆదిత్య బిర్లా గ్రూప్ (రూ.9,300 కోట్లు), షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ (రూ.8,855 కోట్లు), శ్యామ్ గ్రూప్ (రూ.8,500 కోట్లు), ఆస్తా గ్రీన్ ఎనర్జీ (రూ.8,240 కోట్లు), జిందాల్ స్టీల్ (రూ.7,500 కోట్లు), ఏఎంపీ ఎనర్జీ (రూ.5,800 కోట్లు), శ్రీ సిమెంట్స్ (రూ.5,500 కోట్లు), టీసీఎల్ (రూ.5,500 కోట్లు), ఏఎం గ్రీన్‌ఎనర్జీ (రూ.5 వేల కోట్లు), ఉత్కర్ష అల్యూమినియం (రూ.4,500 కోట్లు), ఐపోసియల్ (రూ.4,300 కోట్లు), వర్షిని పవర్ (రూ.4,200 కోట్లు), ఆశ్రయం ఇన్‌ఫ్రా (రూ.3,500 కోట్లు), మైహోమ్ (రూ.3,100 కోట్లు), వెనీకా జల విద్యుత్ (రూ.3 వేల కోట్లు), డైకిన్ (రూ.2,600 కోట్లు), సన్నీ ఓపోటెక్ (రూ.2,500 కోట్లు), భూమి వరల్డ్ (రూ.2,500 కోట్లు), అల్ట్రాటెక్ (రూ.2500 కోట్లు), ఆంధ్ర పేపర్ ( రూ.2వేల కోట్లు), అంప్లస్ ఎనర్జీ (రూ.1500 కోట్లు), గ్రీడ్ ఎడ్జ్ వర్క్ (రూ.1500 కోట్లు), టీవీఎస్ కంపెనీ(రూ.1500 కోట్లు), హైజెన్ కో (రూ.1500 కోట్లు), వేల్స్ పన్ (రూ.1500 కోట్లు), ఓబెరాయ్ గ్రూప్ (రూ.1,350 కోట్లు), దేవభూమి రోప్‌వేస్ (రూ.1,250 కోట్లు), సాగర్ పవర్ (రూ.1250 కోట్లు), లారస్ గ్రూప్ (రూ.1210 కోట్లు), ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ (రూ.1,113 కోట్లు), డెక్కన్ ఫైన్ కెమికల్స్ (రూ.1,110 కోట్లు), దివీస్ (రూ.1,100 కోట్లు), డ్రీమ్ వ్యాలీ (రూ.1080 కోట్లు), భ్రమరాంబ గ్రూప్ (రూ.1038 కోట్లు), మంజీరా హోటల్స్ అండ్ రిసార్ట్స్ (రూ.1000 కోట్లు), ఏస్ అర్బన్ డెవలపర్స్ (రూ.1000 కోట్లు), శారద మోటార్స్ అండ్ అల్లాయిస్ (రూ.1000 కోట్లు), ఎంఆర్‌కేఆర్ కన్‌స్ట్రక్షన్స్ (రూ.1000 కోట్లు), సెల్‌కాన్ (రూ.1000 కోట్లు), తులి హోటల్స్ (రూ.1000 కోట్లు), విష్ణు కెమికల్స్ (రూ.1000 కోట్లు)తో అవగాహన ఒప్పందాలు కుదిరాయి.