Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

20 వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. వైరస్‌ చాపకింది నీరులా విస్తరిస్తుండటంతో పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగాయి. గురువారం 16,906 మంది పాజిటివ్‌ రాగా, తాజాగా ఆ సంఖ్య 20 వేలు దాటింది. ఇవి నిన్నటికంటే 19 శాతం అధికం. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 20,139 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో 4,36,89,989కి చేరాయి. ఇందులో 4,30,28,356 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,557 మంది మృతిచెందారు. మరో 1,36,076 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనాతో కొత్తగా 38 మంది మృతిచెందగా, 16,482 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. ఇక కేసులు భారీగా నమోదవుతుండటంతో రోజువారి పాజిటివిటీ రేటు 5.10 శాతానికి చేరిందని తెలిపింది. అదేవిధంగా మొత్తం కేసుల్లో 0.31 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.49 శాతం, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయని ప్రకటించింది. ఇప్పటివరకు 199.27 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img