Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

22 యూట్యూబ్‌ చానళ్లపై వేటు

కేంద్రం నిర్ణయం
18 చానళ్లు భారత్‌వే

న్యూదిల్లీ: దేశ భద్రత, జాతీయ సమగ్రత, విదేశీ సంబంధాలకు భంగం కలిగిస్తున్నాయన్న కారణంతో 22 యూట్యూబ్‌ చానళ్లపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ నిషేధించింది. ఇందులో 18 భారత్‌కు చెందినవి కాగా, మరో 4 పాకిస్థాన్‌కు చెందినవి ఉన్నాయి. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. నిషేధిత యూట్యూబ్‌ చానళ్లలో మొత్తం వ్యూయర్‌షిప్‌ 260 కోట్లకు పైగా ఉన్నట్టు తేలింది. సంబంధిత యూట్యూబ్‌ చానళ్లు టెలివిజన్‌ లోగోలు, యాంక్లరను ఉపయోగించి, తప్పుడు థంబ్‌నెల్స్‌తో వీక్షకులను తప్పుదారి పట్టిస్తున్నారని కేంద్రం తెలిపింది. ఐటీ రూల్స్‌ 2021ను ఉల్లంఘించిన కారణంతో తొలిసారిగా 18 యూట్యూబ్‌ చానళ్లను బ్లాక్‌ చేసినట్లు వెల్లడిరచింది. వీటితోపాటు మూడు ట్విటర్‌ అకౌంట్లు, ఒక ఫేస్‌బుక్‌ అకౌంట్‌లను బ్లాక్‌ చేసింది. ఈ చానళ్లు భారత సైన్యం, జమ్మూకశ్మీర్‌ వివాదం వంటి అంశాలపై సామాజిక మధ్యమాల ద్వారా భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నట్టు కేంద్రం వెల్లడిరచింది. అంతేగాక ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న పరిస్థితులకు సంబంధించి కూడా కొన్ని భారతీయ యూట్యూబ్‌ చానళ్లు తప్పుడు కంటెంట్‌ను పబ్లిష్‌ చేస్తున్నారని, ఇవన్నీ ఇతర దేశాలతో భారత్‌కున్న విదేశీ సంబంధాలను దెబ్బతీసే లక్ష్యంతో పనిచేస్తున్నాయని గుర్తించినట్లు తెలిపింది. ఇవి పాకిస్థాన్‌ వేదికగా పనిచేస్తున్నట్టు పేర్కొంది. నిఘా వర్గాల సహకారంతో సమాచార, ప్రసారశాఖ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ఐదేళ్లలో 600 పైగా ప్రభుత్వ సోషల్‌ మీడియా ఖాతాలు హ్యాక్‌
గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 600 సోషల్‌ మీడియా ఖాతాలు హ్యాక్‌కు గురయ్యాయని సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మంగళవారం లోక్‌సభకు తెలిపారు.
ప్రభుత్వ ట్విట్టర్‌, ఈ-మెయిల్‌ ఖాతాల హ్యాకింగ్‌పై అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ… 2017 నుండి అటువంటి ఖాతాలు 641 హ్యాక్‌కు గురైనట్లు పేర్కొన్నారు. 2017లో 175, 2018114, 201961, 202077, 2021186, ఈ ఏడాది ఇప్పటి వరకు 28 ఖాతాలు హ్యాక్‌కు గురయ్యాయని లిఖితపూర్వక సమాధానంలో వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img