Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

23వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య..!

గత ఐదు రోజులుగా వచ్చిన భారీ భూకంపం ధాటికి మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రకృతి ప్రకోపానికి తుర్కియే, సిరియా దేశాల్లో మరణ మృదంగం కొనసాగుతోంది. పేకమేడల్లా కూలిన భవనాల శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం భూకంప మృతుల సంఖ్య 23వేలు దాటినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడిరచాయి. ఒక్క తుర్కియేలోనే 20,318 మంది మృతి చెందగా.. సిరియాలో 3,513 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు దేశాల్లో కలిపి మొత్తం 23,831 మంది మృత్యువాతపడ్డారు. ఇక భూకంపం ధాటికి 80 వేల మందికిపైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డట్లు అధికారులు వెల్లడిరచారు.అయితే భూకంప ప్రభావిత ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. గడ్డకట్టే చలిలోనూ సహాయక బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. ఇందుకోసం 1,10,000 మంది రెస్యూ సిబ్బంది పని చేస్తున్నారని, 5,500 వాహనాలు, క్రేన్లు, బుల్డోజర్లతో శిథిలాలు తొలగిస్తున్నట్టు తుర్కియే అధికారులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img