Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

24న మోదీ, బైడెన్‌ భేటీ

అమెరికా పర్యటన ఖరారు
ద్వైపాక్షిక చర్చల్లో ఉగ్రవాదంపై పోరుకే ప్రాధాన్యం

క్వాడ్‌ యూఎన్‌జీఏ శిఖరాగ్ర సదస్సుల్లో పాల్గోనున్న ప్రధాని న్యూదిల్లీ : భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాధినేతలు ఈనెల 24న వాషింగ్టన్‌లోని శ్వేతసౌధ్యంలో సమావేశం కానున్నారు. వీరికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అతిథ్యం ఇస్తున్నారు. ఈ సందర్భంగా బైడెన్‌తో ప్రధాని నరేంద్రమోదీ భేటీ కూడా అదే రోజు ఖరారు అయినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి తెలిపారు. క్వాడ్‌ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇరువురు నేతలు సమావేశమై ప్రాదేశిక, అంతర్జాతీయ పరిణామాలతో పాటు ఉగ్రవాద నియంత్రణపై ప్రధానంగా చర్చించనున్నట్లు వెల్లడిరచారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటన బుధవారం నుంచి ప్రారంభం కానుందని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ ష్రింఘ్లా మంగళవారం వెల్లడిరచారు. ఇద్దరు దేశాధినేతలు ద్వైపాక్షిక అంశాలతో పాటు అఫ్గాన్‌, కోవిడ్‌ వాక్సిన్‌, తీవ్రవాదం, ఉగ్రవాదంపై ఉక్కుపాదం, రక్షణ, వాణిజ్య సంబందాలను మరింత పటిష్ట పర్చుకోవడం వంటి అనేక అంశాలపై చర్చించే అవకాశముందని చెప్పారు. భారత్‌, అమెరికా మధ్య అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా తీసుకునే చర్యలపైనా ఇరువురు చర్చించనున్నట్లు తెలిపారు. ఈనెల 22 నుంచి 27వ తేదీ వరకు అమెరికాలో మోదీ పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా వాషింగ్టన్‌, న్యూయార్క్‌ను సందర్శిస్తారు. 24వ తేదీ తొలుత బైడెన్‌తో శ్వేతసౌథంలో ద్వైపాక్షిక చర్చలు జరిపి అనంతరం క్వాడ్‌ సదస్సులో మోదీ పాల్గొంటారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంపైనా చర్చించనున్నారు. ఆపై 25 తేదీన న్యూయార్క్‌లో జరగబోయే ఐరాస జనరల్‌ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) 76వ సదస్సులో జనరల్‌ డిబేట్‌లో మోదీ మాట్లాడతారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికైన తర్వాత మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. వీరిద్దరు ఇప్పటివరకు (మార్చిలో క్వాడ్‌ సదస్సు, ఏప్రిల్‌లో వాతావరణంలో మార్పుపై సదస్సు, జూన్‌లో జీ7 సదస్సుల్లో )మూడుసార్లు వర్చువల్‌గా భేటీ అయ్యారు. వాస్తవానికి జీ`7 సదస్సులో పాల్గొనేందుకు యూకేకు మోదీ వెళ్లాల్సి ఉండగా భారత్‌లో కోవిడ్‌ రెండవ దశ విజృంభణ నేపథ్యంలో ఆయన పర్యటన రద్దు అయింది. లేకపోతే అప్పుడే ఈ ఇద్దరు నేతలు ముఖాముఖి కలుకునేవారు. కాగా, జపాన్‌ ప్రధాని యోషిహిడే సుగతోనూ బైడెన్‌ విడిగా భేటీకానున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img