Monday, December 5, 2022
Monday, December 5, 2022

26న పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లతో సోనియా కీలక భేటీ

ఈనెల 26న పార్టీ ప్రధానకార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లతో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమావేశం కానున్నారు. దిల్లీలో జరిగే ఈ కీలక భేటీకి పార్టీ ప్రదాన కార్యదర్శి (సంస్ధాగత) కేసీ వేణుగోపాల్‌ అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశానికి సోనియా గాంధీ హాజరై పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పురోగతిని సమీక్షించడంతో పాటు దేశవ్యాప్తంగా మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాల గురించి పార్టీ నేతలతో చర్చిస్తారు. . మరోవైపు అసమ్మతి నేతలతో కూడిన జీ-23 ప్రతినిధులతో మాట్లాడిన సోనియా పార్టీ ప్రక్షాళన గురించి సంప్రదింపులు జరిపారు. జీ-23 నేతల సూచనలు ఆహ్వానించదగినవని వారు కోరిన రీతిలో పార్టీ నిర్మాణంలో మార్పులు చేపట్టేందుకు సంస్ధాగత ఎన్నికల వరకూ వేచిచూడాలని స్పష్టం చేశారు. ఇక వచ్చే ఏడాది హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా ఆ రాష్ట్ర సీనియర్‌ నేతలతో సోనియా గాంధీ సమావేశమయ్యారు. పంజాబ్‌ తరహా అంతర్గత పోరుకు అవకాశం ఇవ్వకుండా సమిష్టిగా నేతలు పార్టీ విజయం కోసం పనిచేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img