Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

29న జీఎస్‌ఎల్‌వీ -ఎఫ్‌12 ప్ర‌యోగం.. శ‌రవేగంగా ఏర్పాట్లు

అగ్రరాజ్యా లకు ధీటుగా రాకెట్‌ ప్రయోగాలను చేపడుతూ దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ దేశాలకు చాటి చెబుతున్న ఇస్రో(భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) మరో ప్రయోగానికి సన్నద్దమవు తోంది. నావిగేషన్‌ వ్యవస్థను పటిష్ట పరిచే విధంగా రూపొందించిన 2232 కిలోల బరువుగల ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహాన్ని ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి ప్రవేశపెట్ట నుంది. స్వదేశీ పరిజ్ఞానంతో నావిగేషన్‌ వ్యవస్థకు రూపొందించేందుకు శ్రీకారం చుట్టిన ఇస్రో ఇప్పటి వరకు 7 ఉపగ్రహాలను ప్రయోగించి నావిగేషన్‌ వ్యవస్థను పటిష్టపరిచింది. అయితే ఈ ఏడు ఉపగ్రహాలలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1జి ఉపగ్రహం సేవలు నిలిచి పోవడంతో దాని స్థానంలో ఎన్‌వీఎస్‌-01 ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టనుంది. ఈ ఉపగ్రహం 12 సంవత్సరాల పాటు సేవలు అందించేలా రూపొందించారు. ఈ నెల 29వ తేదీన 10.42 గంటలకు ఈ రాకెట్‌ ప్రయోగాన్ని చేపట్టేందుకు ఇస్రో సన్నద్దమవుతుంది. ఇప్పటికే జీఎస్‌ఎల్‌వీ -ఎఫ్‌12 రాకెట్‌ అనుసంధాన ప్రక్రియను శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని అసెంబుల్‌ సెంటర్‌లో శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. రాకెట్‌ అగ్రభాగాన ఎన్‌వీఎస్‌ -01 ఉపగ్రహాన్ని అమర్చి ఉష్ణకవచం అమర్చారు. రాకెట్‌కు ల్యాంచ్‌ ప్యాడ్‌ వద్దకు చేర్చి తుది పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ల్యాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు, ఎంఆర్‌ఆర్‌ సమావేశం నిర్వహించి ప్రయోగానికి గ్రీన్‌ సిగ్నెల్‌ ఇస్తే రాకెట్‌ను నింగిలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే స్వదేశీ నావిగేషన్‌ వ్యవస్థ మరింత పటిష్టం కానుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img