Friday, August 12, 2022
Friday, August 12, 2022

31శాతం రాజ్యసభ సభ్యులు నేరస్థులు

సరాసరి ఆస్తి విలువ రూ.79.54 కోట్లు
ఏడీఆర్‌`నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ నివేదిక వెల్లడి

న్యూదిల్లీ: రాజ్యసభ సభ్యుల నేరచరిత్ర, ఆస్తుల వివరాలను ఏడీఆర్‌ వెల్లడిరచింది. పెద్దల సభలో 31శాతం మంది ఎంపీలపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, సరాసరి ఆస్తుల విలువ రూ.79.54 కోట్లుగా ప్రకటించింది. రాజ్యసభలో మొత్తం 233 మంది ఎంపీలకుగాను 226 మంది క్రిమి నల్‌, ఆర్థిక, ఇతర వివరాలపై అసోసియేషన్‌ ఫర్‌ డెమో క్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ ఓ నివే దికను విడుదల చేశాయి. ప్రస్తుత రాజ్యసభలో ఒక సీటు ఖాళీగా ఉంది. ఇద్దరు ఎంపీల అఫిడవిట్లు అందుబాటులో లేకపోవడం వల్ల వివరాలు తెలియలేదు. జమ్ముకశ్మీరుకు చెందిన నాలుగు సీట్లు ఇంకా ఖరారు కాలేదని ఆ నివేదిక తెలిపింది. 226మంది రాజ్యసభ ఎంపీలకుగాను 197(87శాతం) మంది కోటీ శ్వరులు. వీటి ఆధారంగా రాజ్యసభలో ఒక్కో ఎంపీ సరాసరి ఆస్తి విలువ రూ.79.54 కోట్లని వివరిం చింది. ఇక నేరచరిత విషయానికి వస్తే..71(31శాతం) మందిపై క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. 37(16 శాతం) మందిపై తీవ్రమైన నేర కేసులు ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఇద్దరు రాజ్యసభ ఎంపీలపై హత్య కేసులు, నలుగురు ఎంపీలపై హత్యాయత్నం కేసులు ఉన్నాయి. నలుగురిపై మహిళలకు సంబంధించిన నేరాలు నమోదయ్యాయి. అందులో కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌పై అత్యాచారం కేసు ఉంది. ఏడీఆర్‌, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ నివేదిక ప్రకారం రాజ్యసభలో బీజేపీకి చెందిన 85మంది ఎంపీలలో 20(24శాతం) మంది, కాంగ్రెస్‌కు చెందిన 31 మందిలో 12(39 శాతం), తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన 13 మందిలో ముగ్గురు(23శాతం), ఆర్‌జేడీ ఎంపీలు ఆరుగురు ఉండగా ఐదుగురు(83శాతం), సీపీఎంకు చెందిన ఐదుగురిలో నలుగురు(80శాతం), ఆప్‌ ఎంపీలు 10 మంది ఉండగా అందులో ముగ్గురు(30శాతం)పై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. వైసీపీకి చెందిన 9 మందికిగాను ముగ్గురు(33శాతం), ఎన్‌సీపీకి నలుగురు ఉండగా అందులో ఇద్దరు(50శాతం) మందిపై క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు వివరించింది. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్‌ నుంచి 31 మంది ఎంపీలకుగాను ఏడుగురు, మహారాష్ట్ర నుంచి 19మంది ఎంపీలకుగాను 12 మంది, తమిళనాడు నుంచి 18మందికిగాను ఆరుగురు, పశ్చిమబెంగాల్‌ నుంచి 16మందికిగాను ముగ్గురు, కేరళ నుంచి 9మందికిగాను ఆరుగురు, బీహారు నుంచి 16 మందికిగాను 10మందిపై నేరారోపణలు ఉన్నట్లు నివేదిక వివరించింది. ఇవన్నీ ఎంపీలు తమ అఫిడవిట్లలో స్వయంగా పేర్కొన్నవేనని తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img