Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

41 ఏళ్ల తర్వాత మళ్లీ..

ఒలింపిక్స్‌ సెమీస్‌లో భారత హాకీజట్టు

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు అద్భుతం చేసింది. ఆదివారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో గ్రేట్‌ బ్రిటన్‌ జట్టుపై మన్‌ప్రీత్‌ సేన 3-1 తేడాతో ఘన విజయం సాధించి సెమీస్‌కు చేరింది. భారత్‌ తరఫున దిల్‌ప్రీతి సింగ్‌(7వ నిమిషం), గుర్జాంత్‌ సింగ్‌(16వ నిమిషం), హార్దిక్‌ సింగ్‌(57వ నిమిషం) గోల్స్‌ సాధించారు. బ్రిటన్‌ జట్టులోని సామ్‌ వార్డ్‌ మాత్రమే 45వ నిమిషంలో ఒక గోల్‌ చేయగలిగాడు. ఒలింపిక్స్‌లో భారత జట్టు సెమీస్‌కు చేరడం 41 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారి 1972లో భారత జట్టు ఒలింపిక్‌ సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎప్పుడూ భారత జట్టు క్వార్టర్స్‌ దాటలేదు. 1980 ఒలింపిక్స్‌లో భారత జట్టు స్వర్ణం సాధించినప్పటికీ ఆ ఎడిషన్‌లో సెమీఫైనల్‌ స్టేజ్‌ లేదు. కాగా సెమీస్‌కు చేరిన భారత జట్టు ఈ నెల 3వ తేదీన సెమీపైనల్‌ మ్యాచ్‌లో బెల్జియంతో తలపడనుంది. 1972 ఒలింపిక్స్‌లో చివరగా సెమీస్‌ ఆడిన భారత జట్టు.. పాకిస్థాన్‌ చేతిలో 0-2 తేడాతో ఓటమిపాలైంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img