Friday, April 19, 2024
Friday, April 19, 2024

54 చైనీస్‌ యాప్‌లపై కేంద్రం నిషేధాస్త్రం

చైనా యాప్‌ ల విషయంలో భారత్‌ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. 54 చైనీస్‌ యాప్‌లను ప్రభుత్వం నిషేధించింది.ఎలక్ట్రానిక్స్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలోని ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం దేశ భద్రతకు ముప్పు కలిగించే 54 చైనీస్‌ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది.ఇంతకు ముందు సెక్యూరిటీ కారణాలు చూపుతూ గత సంవత్సరం జూన్‌ లో 59, సెప్టెంబర్‌ లో 118 యాప్‌ లను బ్యాన్‌ చేసింది. తాజాగా మరో సారి 54 చైనాకు చెందిన యాప్‌ లను బ్యాన్‌ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో గల్వాన్‌ వ్యాలీలో చైనా సైనికుల దురాక్రమణను అడ్డుకునే సమయంలో 20 మంది సైనికులు వీర మరణం పొందిన తరువాత యాప్‌ లపై చర్యలు చేపట్టింది.కొత్తగా బ్యాన్‌ చేసిన వాటిలో స్వీట్‌ సెల్ఫీ హెచ్‌ డి, బ్యూటీ కెమెరా- సెల్పీ కెమెరా, ఈక్వలైజర్‌ బాస్‌ బూస్టర్‌, క్యామ్‌ కార్డ్‌ ఫర్‌ సేల్స్‌ ఫోర్స్‌ ఈఎన్‌ టి, ఐసోలాండ్‌ 2, యాషెస్‌ ఆఫ్‌ టైమ్‌ లైట్‌, వివో వీడియో ఎడిటర్‌, టెన్‌ సెంట్‌ ఎక్సైవర్‌, ఓమ్నియోజి ఎరీనా, యాప్‌ లాక్‌, డ్యూయల్‌ స్పేస్‌ లైట్‌ యాప్‌ లు ఉన్నాయి. దేశ భద్రతకు ముప్పు ఉన్నందున గతంలో టిక్‌ టాక్‌, వి చాట్‌ వంటి ఫేమస్‌ యాప్‌ లను కేంద్రం దేశంలో బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img