Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

578కి చేరిన ఒమిక్రాన్‌ కేసులు

దేశంలో కొత్తగా 6,531కి కరోనా
దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ క్రమంగా విస్తరిస్తోంది. కంటి మీద కునుకులేకుండా చేస్తున్న కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు దేశంలో మొత్తం 578కి చేరుకున్నాయి.ఇప్పటివరకు 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఓమిక్రాన్‌ కేసులలో అగ్రస్థానంలో ఢల్లీి ఉండగా.. తర్వాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, కేరళ, గుజరాత్‌, రాజస్థాన్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఉన్నాయి. ఢల్లీిలో 142, మహారాష్ట్రలో 141, కేరళలో 57, గుజరాత్‌లో 49, రాజస్థాన్‌ 43, తెలంగాణలో 41, తమిళనాడు 34, కర్ణాటకలో 31 ఒమిక్రాన్‌ కేసులు నమోదై ఉన్నాయి. ఇప్పటివరకు భారత్‌లో ఒమిక్రాన్‌ నుంచి 151 మంది కోలుకున్నారు. ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో దేశంలో కరోనావైరస్‌ మహమ్మారి కేసులు 6,531 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి 315 మంది మృతిచెందగా, 7,141మంది కోలుకున్నారు. ప్రస్తుతం 75,841 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. కరోనా రీకవరీ రేటు 98.40 శాతంగా నమోదు అయ్యింది. ఇదే సమయంలో కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య నాలుగు లక్షల 79 వేల 997కు చేరుకుంది. ఇప్పటివరకు 3 కోట్ల 42 లక్షల 37 వేల 795 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img