Sunday, February 5, 2023
Sunday, February 5, 2023

7 దేశాల భద్రతా సలహాదారులతో అజిత్‌ దోవల్‌ చర్చలు

ప్రాంతీయ భద్రతా అంశంపై దిల్లీలో ఇవాళ చర్చలు జరుగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌ గురించి జాతీయ భద్రతాసలహాదారు అజిత్‌ ధోవల్‌ ఆధ్వర్యంలో వివిధ దేశాలకు చెందిన భద్రతా సలహాదారుల ఆ సమావేశాల్లో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో అజిత్‌ ధోవల్‌ మాట్లాడుతూ.. ఆఫ్ఘనిస్తాన్‌లో జరుగుతున్న పరిణామాలు చాలా సునిశితంగా పరిశీలిస్తున్నామని, అక్కడ జరుగుతున్న పరిణామాలు ఆ దేశానికే కాకుండా, పొరుగు దేశాలకు, ఈ ప్రాంతానికి కీలకంగా మారనున్నట్లు చెప్పారు. ఆఫ్ఘన్‌ అంశంపై ప్రాంతీయ దేశాల మధ్య పరస్పర చర్చలు, సహకారం అవసరమన్నారు. ఇక్కడ జరుగుతున్న చర్చలు ఆఫ్ఘన్‌ ప్రజలకు ఉపయోగపడుతాయని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఈ సమావేశాలకు రష్యా, ఇరాన్‌తో పాటు అయిదు సెంట్రల్‌ ఏషియా దేశాలు హాజరవుతున్నాయి. కజకిస్తాన్‌, కిర్గిస్తాన్‌, తజకిస్తాన్‌, తుర్కమిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌ దేశాలకు చెందిన భద్రతా సలహాదారులు కూడా ఈ సమావేశాలకు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img