Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

70 డెల్టా ప్లస్‌ కేసులు

ఏపీ, తెలంగాణల్లో రెండేసి నమోదు
లోక్‌సభలో మంత్రి జితేంద్ర సింగ్‌ ప్రకటన

న్యూదిల్లీ : దేశంలో కొవిడ్‌ డెల్టాప్లస్‌ వేరియంట్‌ 70 కేసులు నమోదు అయినట్లు కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ శుక్రవారం లోక్‌సభకు రాతపూర్వకంగా తెలిపారు. ఐఎన్‌ఎస్‌ఏసీఓజీ గ్రూపింగ్‌ 28 ల్యాబ్‌లలో డెల్టాప్లస్‌ వేరియంట్‌ జినోమ్‌ సీక్వెన్సింగ్‌ ఆనవాళ్లు కనిపించినట్లు వెల్లడిరచారు. తెలుగు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదైనట్టు చెప్పారు. ఈ నెల 23 వరకు దేశ వ్యాప్తంగా ఈ రకం కేసులు 70 వెలుగుచూడగా.. తెలంగాణలో 2, ఏపీలో 2 చొప్పున నమోదైనట్టు తెలిపారు. 13 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 28 జినోమిక్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ల్లో చేసిన పరిశోధనల్లో ఈ కేసులను గుర్తించినట్టు చెప్పారు. టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్‌ సహా పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో మంత్రి ఈ వివరాలను పేర్కొన్నారు. 58,240 సార్స్‌సీఓవీ2 నమూనాలలో 46,124ను పరిశీలించగా 17,169లో డెల్లా వేరియంట్‌ ఉన్నట్లు నిర్థారణ అయిందని సింగ్‌ తెలిపారు. 4,172 ఆల్ఫా వేరియంట్‌ కేసులు రాగా 217 బీటీ వేరియంట్‌వి, ఒక్కటి మాత్రమే గామా కేసు నమోదు అయినట్లు వెల్లడిరచారు. మహారాష్ట్రలో 23 డెల్టాప్లస్‌ కేసులు నమోదు కాగా మధ్యప్రదేశ్‌లో 11, తమిళనాడులో 10, చండీగఢ్‌లో నాలుగు, కేరళలో మూడు, కర్ణాటకలో మూడు, ఆంధ్రప్రదేశ్‌ పంజాబ్‌, గుజరాత్‌, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు చొప్పున, ఉత్తరప్రదేశ్‌, హరియాణా, జమ్మూ, రాజస్థాన్‌, ఒడిశా, హిమాచల్‌ ప్రదేశ్‌లలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదు అయ్యాయని దిగువసభకు సింగ్‌ వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img