Friday, April 19, 2024
Friday, April 19, 2024

8 యూట్యూబ్‌ ఛానళ్లను బ్లాక్‌ చేసిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం 8 యూట్యూబ్‌ ఛానళ్లకు బ్లాక్‌ చేసింది. ఈ ఛానళ్లు నకిలీ, దేశ వ్యతిరేక, తప్పుడు వార్తలను ప్రసారం చేస్తోన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరిలో అమల్లోకి వచ్చిన ఐటీ రూల్స్‌ ప్రకారం స్వదేశంతో పాటు విదేశీ సోషల్‌ మీడియా వేదికలు, యూట్యూబ్‌లు, ఫేస్‌బుక్‌ ఖాతాలపై చర్యలు తీసుకుంటోంది. తాజాగా, మరో 8 ఛానెల్స్‌ను నిషేధిస్తూ కేంద్ర సమాచార శాఖ నిర్ణయం తీసుకుంది. వీటిలో ఒకటి దాయాది పాక్‌కు చెందిన ఛానల్‌ కూడా ఉన్నట్టు పేర్కొంది.ఈ ఎనిమిదితో కలిసి గతేడాది డిసెంబరు నుంచి దేశంలో నిషేధించిన యూట్యూబ్‌ ఛానెల్స్‌ సంఖ్య 102కు చేరింది. అలాగే, యాంటీ ఇండియా కంటెంట్‌ ప్రసారం చేస్తోన్న ఓ ఫేస్‌బుక్‌ ఖాతాను ఐటీ రూల్స్‌ 2021 ప్రకారం నిషేధించినట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నిషేధించిన ఎనిమిది యూట్యూబ్‌ ఛానెల్స్‌కు దాదాపు 86 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు, 114 కోట్లకుపైగా వ్యూస్‌ ఉన్నాయి.అయితే ఆ ఛానళ్లు విద్వేషాన్ని రెచ్చగొడుతోందని, మత వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నట్లు ఐబీ శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img