Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

85 శాతం మందికి సింగిల్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ పూర్తి : కేంద్రం

దేశంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ప్రతిరోజూ దాదాపు కోటి మందికి టీకా వేస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో అర్హులైన వారిలో 85 శాతం మందికి సింగిల్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ పూర్తయ్యిందని కేంద్రం వెల్లడిరచింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుక్‌ మాండవీయ ఒక ప్రకటన చేశారు.ఈ సందర్భంగా మంత్రి దేశ ప్రజలకు అభినందనలు తెలియజేశారు.. నేటితో దేశంలో వ్యాక్సినేషన్‌కు అర్హులైన 85 శాతం మందికి సింగిల్‌ డోస్‌ టీకాలు వేయడం పూర్తయ్యింది. ప్రధాని మోదీ సబ్‌కా ప్రయాస్‌ అనే మంత్రంవల్లనే కరోనా వ్యతిరేక పోరాటంలో దేశంలో బలంగా దూసుకుపోతున్నది అని మన్సుక్‌ మాండవీయ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సోమవారం నాటికి 128.66 కోట్ల వ్యాక్సిన్‌ పూర్తయ్యింది. సోమవారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు దాదాపు 71 లక్షల వ్యాక్సిన్‌ డోసులు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img