Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

మళ్లీ వెయ్యి కోట్ల అప్పు

. 11 ఏళ్లలో 7.45 శాతం వడ్డీతో చెల్లింపు షరతు
. ఐదు నెలల్లో రూ.35,500 కోట్లకు చేరిక

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మంగళవారం అప్పులు చేసే కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది. దీనిలో భాగంగా రిజర్వు బ్యాంకు సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొని మరో వెయ్యి కోట్లు అప్పు తెచ్చింది. వీటిని 11 సంవత్సరాల్లో 7.45 శాతం వడ్డీతో చెల్లించే షరతుతో తీసుకున్నారు. కేవలం ఆర్‌బీఐ దగ్గర సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా గత 5 నెలల కాలంలో 35,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఏపీ సర్కారు రికార్డు సృష్టించింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పూర్తి కావడంతో మళ్లీ అప్పు కోసం దిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ చుట్టూ రాష్ట్ర అధికారులు తిరుగుతున్నారు. ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు ఇవ్వాల్సి ఉండటంతో మళ్లీ అప్పు కోసం కేంద్రాన్ని కాకా పడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి గత ప్రభుత్వం కంటే తాము అప్పులు బాగా తక్కువ తెచ్చామని ఒక ప్రక్క విస్తృత ప్రచారం చేస్తూ, మరోవైపు అవకాశం ఉన్న ప్రతిచోటా అప్పులు తీసుకువస్తుండడంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img