Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసే వారిలో
44 శాతం నేరచరితులే

ఓటు హక్కున్న మహిళా ఎంపీ, ఎమ్మెల్యేలు 10 శాతమే
ఏడీఆర్‌ నివేదిక వెల్లడి

న్యూదిల్లీ: రానున్న రాష్ట్రపతి ఎన్నికలకు ఓటు వేయనున్న ఎంపీలు, ఎమ్మెల్యేలలో దాదాపు 44 శాతం మంది పై క్రిమినల్‌ కేసులు నమోదయి నట్లు వెల్లడయ్యింది. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) మంగళవారం విడుదల చేసిన ఒక విశ్లేషణ నివేదికలో 10,74,364 ఓట్లలో మొత్తం 4,72,477 ఓట్లు (44 శాతం) నేరపూరిత కేసులు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలవే కావడం గమనార్హం. ఏడీఆర్‌, జాతీయ ఎన్నికల నిఘా సంస్థ మొత్తం సిట్టింగ్‌ ఎంపీలు, ఎమ్మెల్యేల 4,809 అఫిడ విట్‌లలో 4,759 విశ్లేషించాయి. ఇందులో దేశం లోని అన్ని రాష్ట్రాలకు చెందిన 776 ఎంపీల అఫిడవిట్‌లలో 768, 4,033 ఎమ్మెల్యేలలో 3,991 ఉన్నాయి. దేశానికి కొత్త రాష్ట్రపతి ఎన్నుకునేందుకు జులై 18న రాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేయనున్న వారు సమష్టిగా ఎలక్టోరల్‌ కాలేజీని ఏర్పాటు చేసుకుంటారు. 542 మంది లోక్‌సభ ఎంపీల్లో దాదాపు 236 మంది (44 శాతం), 226 మంది రాజ్యసభ ఎంపీల్లో 71 మంది (31 శాతం), 3,991 మంది ఎమ్మెల్యేల్లో 1,723 (43 శాతం) మంది (అన్ని రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్ర పాలిత ప్రాంతాలు) పై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని విశ్లేషించింది. 4,759 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు విశ్లేషించగా, 1,316 (28 శాతం) మంది సభ్యులు తమ ఇటీవలి ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన స్వీయ ప్రమాణపత్రంలో తమపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. 542 మంది లోక్‌సభ ఎంపీల్లో దాదాపు 157 మంది (29 శాతం), 226 మంది రాజ్యసభ ఎంపీల్లో 37 మంది (16 శాతం), 1,122 మంది (3,991 మంది ఎమ్మెల్యేల్లో 28 శాతం మంది (అన్ని రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్ర పాలిత ప్రాంతాలు) పై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఈసీఐకి సమర్పించిన స్వీయ ప్రమాణ పత్రాల ప్రకారం 4,759 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలలో 3,843 మంది (81 శాతం) కోటీశ్వరులు అని నివేదిక పేర్కొంది. 542 మంది లోక్‌సభ ఎంపీల్లో 477 మంది (88 శాతం), 226 మంది రాజ్యసభ ఎంపీల్లో 197 మంది (87 శాతం), 3,991 మంది ఎమ్మెల్యేల్లో (అన్ని రాష్ట్ర అసెంబ్లీలు, కేంద్ర పాలిత ప్రాంతాలు) 3,161 మంది (79 శాతం) కోటీశ్వరులు. ఇదిలా ఉండగా, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న మొత్తం 4,759 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలలో 477 మంది (10 శాతం) మాత్రమే మహిళలు. ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు వేయడానికి అర్హులయిన ఓట్ల సంఖ్య ఆధారంగా 10,74,364 మహిళా ఓట్లలో 1,30,304 (13 శాతం) ఓట్లు ఉన్నాయి. ఎంపీలలో లోక్‌సభలో 81 మంది మహిళా ఎంపీల నుంచి 3,79,400 ఓట్లలో 56,700 (15 శాతం), రాజ్యసభలో 31 మహిళా ఎంపీల నుంచి 1,58,200 ఓట్లలో 21,700 (14 శాతం) ఉన్నాయి. రాష్ట్రాల అసెంబ్లీల విషయానికొస్తే, ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 83,824 ఓట్లలో 9,776 ఓట్లు (403 ఎమ్మెల్యేలలో 47), పశ్చిమ బెంగాల్‌లో 44,394 (294 ఎమ్మెల్యేలలో 41)కి గాను 6,191 ఓట్లు, బీహార్‌లో 41,693 (241 మంది ఎమ్మెల్యేలలో 26 మంది)కి గాను 4,498 ఓట్లు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img