Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

మరో రూ.2 వేల కోట్ల అప్పు

ఇక 8 వేల కోట్లకే అవకాశం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మంగళవారం అప్పులు తీసుకొచ్చే కార్యక్రమాన్ని రెండు నెలలుగా క్రమం తప్పకుండా కొనసాగిస్తోంది. దీనిలో భాగంగానే తాజాగా మరో రూ. 2వేల కోట్లు అప్పు తీసుకువచ్చింది. రిజర్వు బ్యాంకు వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలంలో రూ. వెయ్యి కోట్లు 20 ఏళ్లకు 7.42 శాతం వడ్డీతో, రూ.5 వందల కోట్లు 18 ఏళ్లకుగాను 7.42 శాతం వడ్డీతో, మరో రూ.5 వందల కోట్లు 16 ఏళ్లకుగాను 7.43 శాతం వడ్డీతో అప్పు తెచ్చింది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి మేరకు ఈ ఆర్థిక సంవత్సరం రుణ పరిమితిలో ఇక రూ.8 వేల కోట్లే మిగిలాయి. కేవలం 84 రోజుల వ్యవధిలో సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఇప్పటివరకు రూ.22,500 కోట్ల అప్పు తీసుకొచ్చి జగన్‌ సర్కార్‌ రికార్డ్‌ సృష్టించింది. ప్రతి మంగళవారం అప్పు తీసుకొచ్చే ప్రక్రియను ఇలాగే కొనసాగిస్తే ఎఫ్‌ఆర్‌బీఎం నిర్ణయం మేరకు జులై నెలాఖరు నాటికే పరిమితి పూర్తి అవుతుంది. ఆ తర్వాత పరిస్థితిపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img