Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

అనూహ్యంగా దిశ మార్చుకున్న అసని

అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో అసని తుపాను బలహీనపడింది. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50కి.మీ., నర్సాపురానికి 30కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. అనూహ్యంగా దిశ మార్చుకుంటున్న తుపాను అసని… నర్సాపురం తీరానికి దిగువన అల్లవరానికి సమీపంలో భూభాగం పైకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఐఎండీ అంచనా వేసింది. ప్రస్తుతం గంటకు 6కి. మీ. వేగంతో కదులుతున్నట్టు తెలిపింది. భూభాగం పైకి వచ్చిన అనంతరం సాయంత్రంలోగా యానాం వద్ద తిరిగి సముద్రంలోకి తుపాను ప్రవేశించే అవకాశం. అనంతరం క్రమంగా బలహీన పడి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. పూర్తిగా బలహీనపడే వరకూ తీరం వెంబడే పయనిస్తుందని తెలిపింది. కోస్తాంధ్ర తీరానికి అతి దగ్గరగా రావటంతో గాలుల తీవ్రత తగ్గింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లాల యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేయడంతోపాటు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తోంది. తుఫాన్ ప్రభావం భారీగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ.. క్రమ క్రమంగా బలహీనపడడంతో కొంత వరకు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img