Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

మధ్యప్రదేశ్ లో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

ఇవాళ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఒకే విడతలో పోలింగ్ జరుపుతున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి 27.62 పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్ ముగియనుంది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు, ఛత్తీస్ గఢ్ లో నేడు రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో ఈ నెల 7న తొలి విడతలో 20 స్థానాలకు పోలింగ్ జరిగింది. మిగిలిన 70 స్థానాలకు నేడు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటల సమయానికి 19.05 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img