ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. దేశంలోనూ వాయు కాలుష్యం నానాటికీ పెరిగిపోతుంది. దీని వల్ల ప్రజల ఆయుఃప్రమాణాలు తగ్గిపోతాయని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది. ఇక, దక్షిణాసియాలో 2013 నుంచి 2021 మధ్య వాయు కాలుష్యం 9.7% పెరిగింది. గాలి జీవన నాణ్యత సూచి అంచనా ప్రకారం ఆ ప్రాంతంలో అదనంగా 6 నెలలు ఆయుర్దాయం తగ్గింది. భారతదేశంలో 2.5 స్థాయిలు 9.5% పెరిగాయి. వాయు కాలుష్యంతో భారతీయుల సరాసరి ఆయుర్దాయం 5.3 ఏళ్లు తగ్గిపోతుందని తాజాగా ఓ అధ్యయనం హెచ్చరించింది. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని ఢిల్లీ మొదటి స్థానంలో ఉన్నట్టు అధ్యయనం పేర్కొంది. ప్రస్తుత కాలుష్య స్థాయి ఇదే రీతిలో కొనసాగితే ఢిల్లీ ప్రజలు 11.9 ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. షికాగో యూనివర్సిటీకి చెందిన ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన ావాయునాణ్యత జీవన సూచీ (ఏక్యూఎల్‌ఐ) నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాల కంటే భారత్ కాలుష్యం చాలా ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. భారత్‌లోని 67.4 శాతం మంది ప్రజలు అధిక కాలుష్య స్థాయిలున్న ప్రాంతాల్లోనే జీవిస్తున్నారని తాజా నివేదిక తెలిపింది. ముఖ్యంగా పీఎం 2.5 (అతిసూక్ష్మ ధూళి కణాల కాలుష్యం) కారణంగా భారత ప్రజల సరాసరి ఆయుర్దాయం 5.3 ఏళ్లు తగ్గిపోతోందని వివరించింది. ప్రపంచంలోనే ఢిల్లీ అత్యంత కాలుష్య నగరమని.. అక్కడ ఏక్యూఎల్‌ఐను డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలతో పోల్చి చూస్తే చాలా తక్కువగా ఉందని చెప్పింది. అక్కడ 1.8 కోట్ల మంది ప్రజలు తమ జీవిత కాలంలో 11.9 ఏళ్లను కాలుష్యం కారణంగానే కోల్పోనున్నారని పేర్కొంది.