Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రేపు భువనేశ్వరి నిరాహార దీక్ష

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

విశాలాంధ్ర – నంద్యాల : చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ అక్టోబరు 2న నారా భువనేశ్వరి నిరాహార దీక్ష చేస్తారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. నంద్యాలలో శనివారం మాజీ సీఎం చంద్రబాబు అరెస్టయిన ఆర్కే ఫంక్షన్‌ హాల్‌ నందు దాదాపు రెండు గంటల పాటు పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అవినీతి చేయని తాము అరెస్టులకు, కేసులకు ఎందుకు భయపడాలన్నారు. అక్టోబరు 2 రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ప్రతి ఇంటిలో లైట్లన్నీ ఆపేసి, వరండాలో కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేయాలన్నారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దీక్షలు మూడో తేదీ వరకు కొనసాగుతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 97 మంది బాబుపై బెంగతో చనిపోయారని, వారిని పరామర్శించేందుకు కార్యచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. వారి

ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. జనసేన`టీడీపీి కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయని, త్వరలో జాయింట్‌ యాక్షన్‌ కమిటీ తరపున టీడీపీ, జనసేన నాయకుల పేర్లను వెల్లడిస్తామన్నారు. పవన్‌ కళ్యాణ్‌ నాలుగు రోజుల వారాహి యాత్రకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మద్దతు పలకాలని కోరారు. నాలుగున్నర సంవత్సరాల జగన్‌ పాలనలో తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ ఓడిపోతుందనే బెంగతో జగన్‌ కేసులు పెడుతున్నాడని, పార్టీ తరపున లీగల్‌ సెల్‌ కార్యకర్తలకు అండగా ఉంటుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు నీటిపారుదల ప్రాజెక్టులను సందర్శించిన సమయంలో అంగళ్ల కేసులో దాదాపు 50 మందిపై కేసులు పెట్టారని, వారు నిన్ననే విడుదలయ్యారని అన్నారు.
వైసీపీ పాలనలో వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేశారని, ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పీఏసీ సమావేశంలో కమిటీ సభ్యులు నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, పయ్యావుల కేశవ్‌, షరీఫ్‌, నిమ్మల కృష్టప్ప, బి.సి.జనార్ధన్‌ రెడ్డి, అనిత, అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఫరూక్‌, మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌, మాజీ అధ్యక్షులు గౌరవ వెంకట్‌ రెడ్డి, టీడీపీి డోన్‌ ఇన్‌ఛార్జ్‌ ధర్మారం సుబ్బారెడ్డి, టీడీపీ నంద్యాల నాయకులు ఎ.వి.సుబ్బారెడ్డి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.ఎం.డి.ఫిరోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img