జగన్‌ పాదయాత్ర వెనుక ఉద్దేశమదే!

379

జగన్‌ పాదయాత్ర వెనుక ఉద్దేశమదే!
విశాలాంధ్ర/విశాఖపట్నం: రాష్ట్రంలో భూములు, ఖనిజాలు ఎక్కడున్నాయో చూసేందుకే జగన్‌ మోహన్‌రెడ్డి పాదయాద్ర చేశారని టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. విశాఖ జిల్లా తాళ్లవలసలో నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘జగన్‌ కన్నుపడితే ఏదైనా గోవిందా గోవిందా’’ అని వ్యాఖ్యానించారు. రుషికొండకు వెళ్తానంటే రాష్ట్ర ప్రభుత్వం తనను ఎందుకు అడ్డుకుందని నిలదశారు. రుషికొండకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉందన్నారు. పర్యావరణాన్ని నాశనం చేస్తూ రుషికొండను పిండి చేస్తున్నారని ఆరోపించారు. రుషికొండలో కట్టేది పర్యాటక ప్రాజెక్టు అయినప్పుడు ప్రభుత్వానికి అంత ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. విశాఖలో వైకాపా నేతల కబ్జాలు, ఆక్రమణలకు లెక్కేలేదని, వారు మింగినదాన్ని కక్కిస్తానని చంద్రబాబు శపథం చేశారు.