London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Monday, October 7, 2024
Monday, October 7, 2024

కర్ణాటక గవర్నర్‌ ఆదేశాలను హైకోర్టులో సవాల్‌ చేసిన సీఎం సిద్ధరామయ్య

మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ కుంభకోణంపై సిద్ధరామయ్యను విచారించేందుకు కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఇటీవల ఆమోదం తెలుపడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సీఎంపై విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చినందున ఇక సిద్ధరామయ్య అరెస్ట్‌ ఖాయమనే ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ముడా కుంభకోణంలో తనపై విచారణకు గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ అనుమతి ఇవ్వడాన్ని సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు గవర్నర్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరపాల్సి ఉంది. ఇదిలావుంటే గతంలో గవర్నర్‌ల అనుమతితో విచారణ ఎదుర్కొన్న పలువురు ముఖ్యమంత్రులు అరెస్టయ్యారు. దాంతో ఇప్పుడు కర్ణాటక సీఎం కూడా అరెస్టవుతారానే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ముడా కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వతి ప్రధాన నిందితురాలుగా ఉన్నారు. మైసూర్‌లో అక్రమంగా భూములు సేకరించారని సిద్ధరామయ్యపై ఆరోపణలు ఉన్నాయి. గత నెల రోజులుగా ఇదే అంశం కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తోంది. భార్య బీఎం పార్వతికి కేటాయించిన భూమికి సంబంధించిన కేసులో సిద్ధరామయ్యను విచారించడానికి అనుమతించాలని కోరుతూ కొద్ది రోజుల క్రితం సామాజిక కార్యకర్త, న్యాయవాది టీజే అబ్రహం.. గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సిద్ధరామయ్యపై విచారణకు గవర్నర్ గెహ్లాట్‌ అనుమతించారు. వాస్తవానికి తనపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను గవర్నర్ తిరస్కరిస్తారని సిద్ధరామయ్య భావించారు. కానీ అనూహ్యంగా గవర్నర్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img