Friday, December 8, 2023
Friday, December 8, 2023

హమాస్‌ స్థావరాలపైభీకర దాడులు

. 200 మంది మృతి
. భారీ సంఖ్యలో హమాస్‌ ఫీల్డ్‌ కమాండర్లు
. గాజాను రెండుగా చేసుకుని కీలక దాడులు
. ఇజ్రాయిల్‌ రక్షక దళం ప్రకటన

టెల్‌అవీవ్‌: ఇజ్రాయిల్‌ రక్షక దళాలు గాజాపై విరుచుకుపడ్డాయి. ఆదివారం రాత్రంతా హమాస్‌కు గాజాలో పట్టు ఉన్న ప్రదేశాలపై అత్యాధునిక క్షిపణులు, బాంబులతో భీకర దాడులకు పాల్పడ్డాయి. సుమారు 450 స్థావరాలపై ఇజ్రాయిల్‌ దాడి చేసి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇజ్రాయిల్‌ భీకర దాడి వల్ల అండర్‌గ్రౌండ్‌ కేంద్రాలన్నీ దెబ్బతిన్నాయి. హమాస్‌కు చెందిన కేంద్రాలపై విస్తృతస్థాయిలో దాడులు కొనసాగిస్తున్నట్లు ఇజ్రాయిల్‌ రక్షక దళం (ఐపీఎఫ్‌) ప్రకటించింది. పెద్ద ఎత్తున తమపై క్షిపణి దాడులు జరిగాయని హమాస్‌ కూడా ప్రకటించింది. తాజా దాడుల్లో సుమారు 200 మంది వరకు మరణించి ఉంటారని అంచనా వేస్తున్నారు. హమాస్‌కు చెందిన ఫీల్డ్‌ కమాండర్లు భారీ సంఖ్యలో ప్రాణాలు విడిచి ఉంటారని ఇజ్రాయిల్‌ ప్రకటించుకుంది. బెటాలియన్‌, బ్రిగేడియర్‌ స్థాయిల్లో ఉన్న కమాండర్లు హతమైనట్లు ఐపీఎఫ్‌ తెలిపింది. సొరంగాల్లో దాగి ఉన్న ఫీల్డ్‌ కమాండర్లు కూడా చనిపోయి ఉంటారని పేర్కొంది. హమాస్‌ సీనియర్‌ నేతలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయిల్‌ చెప్పింది. కాగా గాజా నగరాన్ని రెండుగా వేరు చేసుకొని నలువైపుల నుంచి కీలక స్థావరాలపై దాడులు చేస్తున్నట్టు ఐపీఎఫ్‌ ప్రకటించింది. తమ దళాలు గాజా నగరాన్ని చుట్టుముట్టాయని, ఉత్తర గాజా – దక్షిణ గాజాగా వేరు చేసుకొని దాడులు కొనసాగిస్తున్నాయని ఐపీఎఫ్‌ ప్రతినిధి డేనియల్‌ హగారి ప్రకటించారు. ఈయుద్ధంలో ఇది చాలా ముఖ్య మైన దశ అని పేర్కొ న్నారు. తాము మరింత కీలకంగా దాడులు చేయబోతున్నామని ఆయన చెప్పారు. ఇప్పటికే తమ దళాలు గాజా నగర తీర ప్రాంతానికి చేరుకున్నాయని తెలిపారు. ఉత్తర గాజాలో ఉన్న పౌరులు దక్షిణ గాజాకి చేరుకోవడానికి ప్రత్యేకంగా కారిడార్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆదివారం రాత్రి జరిపిన దాడిలో హమాస్‌ ఔట్‌పోస్ట్‌ను స్వా ధీనం చేసుకున్నట్లు ఐడీఎఫ్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసింది. 450 లక్ష్యాలపై తమ ఫైటర్‌ జెట్లు దాడులు చేశాయని వెల్లడిరచింది. గాజాలో మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలకు మళ్లీ అంతరాయం కలిగినట్లు పలస్తీనియాకు చెందిన రెడ్‌ క్రెసెంట్‌ అనే స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఇజ్రాయిల్‌ దళాల దాడులతో ఇప్పటివరకు 10 వేల మంది మృతి చెం దారని గాజా ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఎక్కువగా పౌరులే ఉన్నారని వివరించింది. నాలుగు వారాల నుంచి కొనసాగుతున్న యుద్ధంపై ప్రపంచ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయిల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు బందీలను తిరిగి అప్పగించే వరకు కాల్పుల విరమణ ఉండబోదని చెప్పడం మరింత కలవరానికి గురిచేస్తోంది. కాగా మధ్య ఆసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పలస్తీనా, ఇరాక్‌ అధ్యక్షులతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకన్‌ ఇప్పటికే భేటీ అయ్యారు. ఇజ్రాయిల్‌-హమాస్‌ యుద్ధంపై ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పశ్చి మాసియా విదేశాంగ మంత్రులతో మాట్లాడతారని వైట్‌హౌస్‌ వర్గాలు వెల్లడిరచాయి. గాజా పౌరులకు మానవతా సాయాన్ని పెంచేం దుకు ఆమె కృషి చేస్తారని పేర్కొన్నాయి. మానవతా సంక్షోభ నివారణకు తక్షణం కాల్పుల విరమణను పాటించాలని ఐక్యరాజ్యసమితికి చెందిన వివిధ సంస్థల అధిపతులు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
ఆ కార్ల వీడియోను రిలీజ్‌ చేసిన ఇజ్రాయిల్‌
అక్టోబర్‌ 7న నోవామ్యూజిక్‌ ఫెస్టివల్‌లో హమాస్‌ దాడుల్లో ధ్వంసమైన కార్ల వీడియోను ఇజ్రాయిల్‌ సైన్యం విడుదల చేసింది. కిబ్బజ్ట్‌ బీరీ నోవా సంగీత కచేరీతోపాటు ఇతర ప్రాంతాల్లో హమాస్‌ మిలిటెంట్లు ధ్వంసం చేసిన వాహనాలన్నిటినీ అదేచోట పేర్చింది. వీడియోలో కనిపిస్తున్న వాహనాల్లో కొన్ని పాక్షికంగా ధ్వంసం కాగా… మరికొన్ని పూర్తిగా ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఆ వాహనాలను ఫోరెన్సిక్‌ నిపుణులు పరిశీలిస్తున్నారు. ఈ వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్లను వెతికేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దాడి ఎలా జరిగిందన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. బూడిదైన కార్లలో మానవ అవశేషాలు ఏమైనా లభిస్తాయేమోనని వెతుకుతున్నారు. పూర్తిగా గల్లం తైన తమ కుటుంబీకులు, స్నేహితుల అవశేషాల కోసం ఇజ్రాయిల్‌ ప్రజలు గాలిస్తున్నారు. వాటితో సంప్రదాయంగా అంత్యక్రియలు నిర్వ హించాలని కోరుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img