నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని లింగోటం గ్రామంలో ఓ ప్రైవేటు పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన జరిగింది. గురువారం ఉదయం టిఫిన్ చేసిన విద్యార్థులకు కడుపునొప్పి కళ్ళు తిరగడం వంటి లక్షణాలు బయట పడ్డాయి. స్పందించిన పాఠశాల యాజమాన్యం వెంటనే అచ్చంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. 50 మంది విద్యార్థులకు వైద్యులు చికిత్స అందించడం జరిగింది. ఈ విషయంపై కళాశాల ప్రిన్సిపాల్ వివరణ కోరగా ఉదయం అల్పాహారంలో భాగంగా చపాతి పప్పు ఇవ్వడం జరిగిందని తెలిపారు.