Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవులు

భారీ వర్షాల ధాటికి తమిళనాడులో పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. ఈశాన్య రుతుపవనాల కారణంగా ఆ రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు తమిళనాడులో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరదనీరు చేరుకోవడంతో జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల చెట్లు కూలడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. గత కొన్ని రోజులుగా విరామం లేకుండా కురుస్తున్న వానలకు జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.కుంభవృష్టిగా కురుస్తున్న వర్షానికి తమిళనాడులోని ప్రధాన రోడ్లు నదులు, చెరువులను తలపిస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో తమిళనాడులో మరిన్ని భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కడలూరు, మైలదుతురై, నాగపట్నం, తిరువారూర్‌, పుదుచ్చేరిలోని కారైకల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మరోవైపు.. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పట్టు, తంజావూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఈ ఐదు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.అయితే తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండటంతో జన జీవనం స్తంభించింది. దీంతో మరిన్ని భారీ వానలు పడుతాయని వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు అధికారులు ఇప్పటికే సెలవు ప్రకటించారు. చెన్నైలోని పాఠశాలలు, తిరువళ్లూరు జిల్లాలోని విద్యాసంస్థలు మూతపడ్డాయి. పుదుచ్చేరి, కారైకల్‌లలో పాఠశాలలు, కళాశాలలకు కూడా అధికారులు సెలవు ప్రకటించారు. మరోవైపు.. రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img