ఏపీలో వరుస ప్రమాదాలు ప్రజలను వణికిస్తున్నాయి. మొన్నటికి మొన్న అచ్యుతాపురం పేలుడు ఘటన మరువకముందే నేడు మరో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా మారేడు పల్లెలో టపాకాయల తయారీ కేంద్రం దగ్ధం అయింది. ఈ ఘటనలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాలు. పేలుడు ధాటికి ఇంటి ముందు భాగం కూలిపోయింది. మారేడుపల్లిలోని ఓ ఇంట్లో అక్రమంగా టపాకాయల వ్యాపారం చేస్తున్నారు. ఈ వ్యాపారం కొనసాగిస్తున్న యజమాని ఖాదర్ పాష, ఆయన భార్య జరీనా, మూడేళ్ల కుమారుడు అమిత్ ఉన్నారు. ఈ ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ ప్రతి సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా లైసెన్స్ తీసుకువచ్చి టపాకాయలు దుకాణం పెట్టుకుని విక్రయిస్తున్నారు. అక్రమంగా ఈ పరిశ్రమను అక్కడ కొనసాగిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలంకు చేరుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు.