Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

రాష్ట్రాలకు పన్నుల వాటా పెంచండి..

నీతిఆయోగ్‌ పాలక మండలి సమావేశంలో సీఎంల డిమాండ్‌
కేసీఆర్‌, నితీశ్‌ కుమార్‌ గైర్హాజరు

న్యూదిల్లీ:
రాష్ట్రాలకు కేంద్ర పన్నుల వాటా పెంచాలని నీతిఆయోగ్‌ ఏడవ పాలకమండలి సమావేశంలో కొందరు ముఖ్యమంత్రులు డిమాండు చేశారు.చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బాఘెల్‌ మాట్లాడుతూ, కేంద్ర పన్నులు, సుంకాలలో రాష్ట్ర వాటాను పెంచాలని, తమ వనరులపై భారం పడుతోందని అన్నారు. జీఎస్టీ పరిహారం విషయంలో కొత్త పన్ను విధానం కారణంలో ఆదాయ లోటును ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. 20,000 కంటే తక్కువ జనాభా ఉన్న నగరాల సమీప గ్రామాల్లోనూ గ్రామీణ ఉపాధి హమీ పథకాన్ని అమలు చేయాలన్నారు. ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ, కేంద్ర పథకాల అమలులో రాష్ట్రాలు, కేంద్రం మధ్య వివాదాలను పరిష్కరించాలని అంబుడ్స్‌మన్‌గా నీతి ఆయోగ్‌ ఉండాలని కోరారు. టెలికం, రైల్వే, బ్యాంకింగ్‌ వంటి కేంద్ర జాబితాలో ఉన్న అంశాల్లో ఒడిశాకు అన్యాయం జరుగుతోందన్నారు. ఒడిశాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కొన్ని సమస్యలపై చర్చించారు. సుస్థిర సమ్మిళిత భారత నిర్మాణమే లక్ష్యంగా నీతి ఆయోగ్‌ పాలక మండలి దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగింది. పంటలు, నూనెగింజల పప్పు ధాన్యాలు, వ్యవసాయ-సంఘాల వైవిధ్యం విషయంలో స్వావలంబన సాధించడంతో పాటు జాతీయ విద్యా విధానం అమలు తదితర అంశాలను చర్చించింది.
అన్ని రంగాల్లో స్వాలంభనకు కృషిచేద్దాం: ప్రధాని పిలుపు
స్వీయసమృద్ధి భారతాన్ని ప్రధాని మోదీ ఆకాంక్షిస్తున్నారు. వ్యవసాయ రంగంలో విశ్వగురువు కావాలని కోరుకుంటున్నారు. ఈ విషయాలను ఆయన నీతిఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించాలని, విస్తృత పట్టణీకరణ భారత్‌కు బలం కావాలేగానీ బలహీనత కాదని నొక్కిచెప్పారు. అన్ని రంగాల్లో స్వావలంభన సాధనకు ఐక్యంగా కృషిచేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జీవన నాణ్యత మెరుగవ్వాలని, జీవనం సులభం కావాలని, సేవ ల్లో పారదర్శకత రావాలని అన్నారు. వంట నూనె ఉత్పత్తిలో భారత్‌ స్వీయ సమృద్ధి సాధించాల న్నారు. 2023లో భారత్‌కు జీ20 అధ్యక్ష బాధ్యత లు లభించడాన్ని ప్రస్తావించారు. ఈ అవకాశాన్ని సదర్వినియోగించుకోవాలనిÑ తద్వారా గరిష్ఠ ప్రయోజనం పొందేలా జీ20కి నిబద్ధగల బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు సూచించారు. సహకార సమాఖ్యవాదాన్ని కూడా కొనియాడారు. రాష్ట్రాల కృషి వల్లే భరత్‌ కోవిడ్‌ను కట్టడి చేయగలిగిందన్నారు. గట్టి పట్టుదల, స్థితి స్థాపన ఉంటే పరిమిత వనరులతోనే సవాళ్లను అధిగమించచ్చు అన్న సందేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్‌ ఇచ్చిందని మోదీ అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ భారత్‌ను విశ్వగురువుగా భావిస్తున్నాయని చెప్పారు. ‘75ఏళ్ల స్వతంత్ర భారతంలో అని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఒకచోట సమావేశం అయి దేశానికి కీలకమైన అంశాలపై మూడు రోజులు పాటు చర్చలు జరపడం ఇదే మొదటిసారి. సంయుక్త ప్రక్రియ ద్వారానే సమా వేశ అజెండా రూపొందింద’ని చెప్పారు. మూడు టీలు.. వర్తకం, పర్యాటకం, సాంకేతిక పరిజ్ఞానం (ట్రేడ్‌, టూరిజం, టెక్నాలజీ)లను భారతీయ మిషన్‌ల ద్వారా ప్రపంచమంతటా రాష్ట్రాలు ప్రచారం చేయాలని మోదీ పిలుపునిచ్చారు. దిగు మతులను తగ్గించుకొని ఎగుమతులను పెంచ డంపై దృష్టి పెట్టాలని, అవకాశాలను పెంచుకో వాలని సూచించారు. స్థానిక వస్తువుల వినియో గాన్ని ప్రోత్సహించాలని, ‘వోకల్‌ టు లోకల్‌’ కేవలం ఒక రాజకీయ పార్టీ అజెండా కాదు ఉమ్మడి లక్ష్యం అని మోదీ అన్నారు. జీఎస్టీ వసూళ్లు పెరగాలంటే కేంద్రం`రాష్ట్రాలు ఉమ్మడిగా కృషి చేయాలన్నారు. ఆర్థికంగా బలపడేందుకు 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలిచేందుకు ఇది కీలకమని చెప్పారు. సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రాల సమస్యలు, సూచనలను నీతిఆయోగ్‌ పరిశీలిస్తుందని, ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న ప్రణాళికలతో వస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు రాబోయే 25ఏళ్లలో దేశ ప్రాధాన్యతలను నిర్వచిస్తాయని అన్నారు. నేడు వేసిన విత్తనాలు 2047లో భారత్‌కు ఫలాలిస్తాయని మోదీ ఆకాంక్షించారు. కాగా, జీ20కి అధ్యక్షత వహించే అవకాశం భారత్‌కు లభించడం చరిత్రాత్మకమని, ఏడాది పాటు జీ20 సమావేశాలను భారత్‌ నిర్వహిస్తుందని, ఒక్క దిల్లీలోనే కాదు ప్రతి రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇవి జరుగుతాయని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ అన్నారు. భారత్‌లో సంస్కరణలు రాష్ట్ర స్థాయిలోనే జరగాలని నీతిఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ సుమన్‌ బేరి నొక్కిచెప్పారు. మహమ్మారి తర్వాత భారత్‌ శక్తిమంతంగా ఉండాలన్న విజన్‌ దిశగా కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదిలావుంటే, 2019 తర్వాత నీతి అయోగ్‌ సమావేశం ప్రత్యక్షంగా జరగడం ఇదే మొదటిసారి. సమావేశానికి తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌ రావు, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ మినహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ముగ్గురు లెఫ్టినెంట్‌ గవర్నర్లు, ఇద్దరు అడ్మినిస్ట్రేటర్లతో పాటు కేంద్రమంత్రులు అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ, రాజ్‌నాథ్‌ సింగ్‌, ఎస్‌జైశంకర్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img