Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రపంచ జనాభాలో భారతే నెంబర్‌ వన్‌..

భారత్‌లో అత్యధికంగా 142.86 కోట్ల జనాభా
పపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ నిలిచింది. చైనాను అధిగమించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది. జనాభా విషయంలో చైనా ను భారతదేశం అధిగమించింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ అవతరించిందని ఐక్యరాజ్య సమితి పాపులేషన్‌ ఫండ్‌ తాజా డేటా స్పష్టం చేసింది. చైనా కంటే ఇండియాలో 29లక్షల మంది జనాభా ఎక్కువగా ఉన్నారని తెలిపింది. ఇందుకు సంబంధించి తాజా నివేదికను ఐరాస బుధవారం విడుదల చేసింది. 1950లో ఐరాస జనాభా సమాచారాన్ని వెల్లడిరచడం మొదలు పెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్‌ తొలిసారిగా ప్రథమస్థానంలో నిలిచింది. జనాభా అంచనాలకు సంబంధించి ‘స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ రిపోర్టు 2023’ పేరుతో యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్స్‌ తాజా నివేదికను విడుదల చేసింది. భారత్‌లో అత్యధికంగా 142.86 కోట్ల జనాభా ఉన్నట్లు లెక్కకట్టింది. ప్రస్తుతం చైనా జనాభా 142.57కోట్లగా అంచనా వేసింది. ఇక ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న అమెరికాలో 34 కోట్ల మంది ఉన్నట్లు అంచనా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img