Friday, December 8, 2023
Friday, December 8, 2023

కరువు సమస్యపై విన్నవించేందుకు వెళ్లడం నేరమా? : కె రామకృష్ణ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టపర్తి పర్యటన సందర్భంగా కరువు సమస్యపై విన్నవించేందుకు వెళ్లడం నేరమా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో సీపీఐ, టీడీపీ నేతల అక్రమ అరెస్టులను ఖండించారు. రాష్ట్రంలో కరువు విలయతాండవం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి పట్టడం లేదని విమర్శించారు. కరువు సమస్యపై మాట్లాడేందుకు కూడా జగన్‌కు తీరిక లేదా? అని నిలదీశారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. శ్రీసత్యసాయి జిల్లాలో సీఎం జగన్ పర్యటనను నిరసిస్తూ చలో పుట్టపర్తికి టీడీపీ పిలుపునివ్వగా.. పోలీసులు ఎక్కడికక్కడ టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు , పల్లె రఘునాథరెడ్డి , మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారధి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పోలీసుల అదుపులో ఉన్నారు. మడకశిర నుంచి పోలీసు వాహనాల్లో తరలించి ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నేతలను పోలీసులు నిర్బంధించారు. పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img