Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

ఢిల్లీకి బయల్దేరిన జగన్.. మోదీ, అమిత్ షాలతో భేటీ కానున్న సీఎం

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు వెళ్లిన ముఖ్యమంత్రి.. అక్కడి నుంచి విమానంలో ఢిల్లీకి పయనమయ్యారు. హస్తినలో ఆయన వరుస సమావేశాలతో బిజీగా గడపనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అవుతారు. ఆ తర్వాత సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోదీతో జగన్ భేటీ కానున్నారు. ఏపీకి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించనున్నారు. సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమవుతారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img