Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఘోర రైలు ప్రమాదంపై జగన్ ఉన్నత స్థాయి సమీక్ష.. ప్రమాద స్థలికి మంత్రి గుడివాడ

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ఆయన ఉన్నత స్థాయి సమీక్షను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో సమాచార విభాగాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరమైతే ప్రమాద స్థలికి పంపించడానికి అంబులెన్సులను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఒడిశా సరిహద్దుల్లోని విశాఖపట్నం మినహా, ఇతర జిల్లాల్లో ఆసుపత్రులను ఎమర్జెన్సీ సేవల కోసం అలెర్ట్ గా ఉంచాలని సూచించారు.మరోవైపు మంత్రి అమర్ నాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల బృందాన్ని ఘటనా స్థలికి పంపించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అమర్ నాథ్ రోడ్డు మార్గం ద్వారా ఘటనా స్థలికి బయల్దేరారు. ప్రమాదంలో మృతి చెందిన వారిని, గాయపడిన వారిని ఈ బృందం తరలించే ఏర్పాట్లు చేశారు. హాస్పిటల్స్‌ను అలర్ట్ చేయడంతో పాటు హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసింది. అన్ని రైల్వేస్టేషన్లలో రైల్వే అధికారులు హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయల్లో ఎంక్వైరీ విభాగాలను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏపీకి చెందిన 70 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. విజయవాడకు చెందిన దాదాపు 30 మంది ప్రయాణికులు ఒడిశా రైలు ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారి పరిస్థితి ఎలా ఉందో అనే ఆందోళన వ్యక్తమవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img