Monday, September 25, 2023
Monday, September 25, 2023

కడప ఉక్కుకు ఎగనామం!

. సాంకేతికంగా, ఆర్థికంగా లాభదాయకం కాదు
. విభజన సమస్యల పరిష్కారంలో కేంద్రానిది మధ్యవర్తి పాత్ర
. లోక్‌సభలో స్పష్టంచేసిన హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ప్రత్యేక హోదాతో సహా అనేక విభజన హామీలకు ఒక్కొక్కటిగా తిలోదకాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం…తాజాగా కడప ఉక్కు పరిశ్రమకు కూడా ఎగనామం పెట్టింది. కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం సాంకేతికంగా, ఆర్థికంగానూ లాభదాయం కాదని తేల్చింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 హామీలు, సంబంధిత అంశాలపై టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కె.రామ్మోహన్‌ నాయుడు అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. విభజన సమస్యలను ఆయా రాష్ట్ర్ర ప్రభుత్వాలే పరిష్కరించుకోవచ్చునని, తాము మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. మౌలిక వసతుల ప్రాజెక్టులు, ఉన్నత విద్యాసంస్థలు దీర్ఘకాలిక ప్రాజెక్టులని వెల్లడిరచారు. దుగరాజపట్నం పోర్టు ఏర్పాటు ప్రతిపాదన సాధ్యం కాలేదని, సమీప పోర్టుల నుంచి ఉన్న తీవ్ర పోటీ వల్ల ఇది ఆచరణ సాధ్యం కాలేదన్నారు. రామాయపట్నం పోర్టును అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం సూచించిందని, దానిని నాన్‌ మేజర్‌ పోర్టుగా ఇప్పటికే నోటిఫై చేశామని తెలిపారు. ఈ పోర్టు వద్దని ఏపీ ప్రభుత్వం చెపితే మేజర్‌పోర్టుకు మరో ప్రదేశం గుర్తించాలని సూచించారు. రూ.106 కోట్లతో సౌత్‌ కోస్ట్‌ రైల్వే జోన్‌ కార్యాలయం నిర్మిస్తామని, ఇందుకోసం ఇప్పటికే రూ.10 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఎయిమ్స్‌, ఐసర్‌, ఐఐటీ వంటి కేంద్ర విద్యాసంస్థలతో పాటు, గిరిజన వర్శిటీ, పోలవరం, రాజధాని ప్రాజెక్టులకు మొత్తంగా ఇప్పటివరకు రూ.21,154 కోట్లు ఇచ్చినట్లు మంత్రి వెల్లడిరచారు. వగాహన స్ఫూర్తితో వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఫెసిలిటేటర్‌గా మాత్రమే వ్యవహరిస్తుందని సమాధాన మిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img