Friday, April 19, 2024
Friday, April 19, 2024

అయోధ్య ‘భూ దందా’లో కాషాయ నేతలు

నగర మేయర్‌, బీజేపీ స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే
40 మంది పేర్లు వెల్లడిరచిన అభివృద్ధి మండలి
సీఎం యోగికి ఎంపీ లల్లూ సింగ్‌ ఫిర్యాదు

అయోధ్య : అయోధ్యలో అక్రమంగా భూముల కొనుగోలు, అమ్మకాల్లో కాషాయ నేతల పాత్ర కలకలం రేపుతోంది. అయోధ్య అభివృద్ధి మండలి అక్రమంగా ప్లాట్లు వ్యాపారం చేసి, అటువంటి భూమిలో మౌలిక సదుపాయాలను నిర్మించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మందిలో అయోధ్య ఎమ్మెల్యే వేద్‌ ప్రకాష్‌ గుప్తా, అయోధ్య మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ రిషికేశ్‌ ఉపాధ్యాయ, మిల్కీపూర్‌కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే బాబా గోరఖ్‌నాథ్‌ పేర్లు ఉన్నాయి. ఈ విషయంపై బీజేపీపై విమర్శలు గుప్పించిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌, కాషాయ పార్టీ ‘భ్రష్టాచారి’ (అవినీతిపరులు) కనీసం అయోధ్యను విడిచిపెట్టాలని అన్నారు. అయితే, మేయర్‌ రిషికేశ్‌ ఉపాధ్యాయ, ఎమ్మెల్యే వేద్‌ ప్రకాష్‌ గుప్తా నిర్దోషులని పేర్కొన్నారు. అయోధ్య అభివృద్ధి మండలి విడుదల చేసిన ఆరోపించిన నేరస్థుల జాబితాలో కపట నాటకం ఉందని ఆరోపించారు. అభివృద్ధి మండలి ప్రాంతంలో అక్రమంగా భూములు కొనుగోలు చేసి, విక్రయించి, నిర్మాణ పనులు చేపట్టిన 40 మంది జాబితాను శనివారం రాత్రి విడుదల చేసినట్లు మండలి వైస్‌ చైర్మన్‌ విశాల్‌ సింగ్‌ ఆదివారం పీటీఐకి తెలిపారు. జాబితా జారీ చేయడం ద్వారా ప్రజలకు నోటీసులు జారీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సింగ్‌ తెలిపారు. మొత్తం 40 మందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉపాధ్యాయ్‌, గుప్తా కుట్ర చేశారని, తమను ఈ కేసులో తప్పుగా ఇరికించారని ఆరోపించారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని ప్రత్యర్థి పార్టీలు అయోధ్యలో అక్రమంగా భూముల కొనుగోలు, అమ్మకాల అంశాన్ని లేవనెత్తాయి. ఈ వ్యవహారం పై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ స్థానిక ఎంపీ లల్లూ సింగ్‌… ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ హిందీలో చేసిన ట్వీట్‌లో, ‘మేము ఇంతకు ముందు చెప్పాము. మళ్లీ పునరావృతం చేస్తున్నాము. బీజేపీ అవినీతిపరులు, కనీసం అయోధ్యను విడిచిపెట్టండి’ అని యాదవ్‌ తన ఆరోపణకు మద్దతుగా మీడియా నివేదికను కూడా ట్యాగ్‌ చేశారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన పార్టీ డిమాండ్‌ చేసింది. ‘అయోధ్యలో బీజేపీకి చెందిన మేయర్‌, స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే భూ మాఫియాతో కలిసి అక్రమ కాలనీలు ఏర్పాటు చేస్తున్నారు. బాధ్యతాయుతమైన శాఖలతో కుమ్మక్కై 30 అక్రమ కాలనీలు ఏర్పాటు చేసి రాష్ట్ర ఆదాయానికి వందల కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. అనే విషయంపై విచారణ జరపాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’ అని సమాజ్‌వాది పార్టీ తన అధికారిక ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పేర్కొంది.
భూ మాఫియా ఇలా…!
అయోధ్యలో సరయూ నది ఒడ్డున ఉన్న ప్రభుత్వ నాజుల్‌, గ్రామీణ ప్రాంతాల భూముల్లో ఎక్కువ భాగం ప్రభుత్వ అధికారుల అండతో ఆస్తి వ్యాపారులు పెద్ద ఎత్తున విక్రయించారు. ఈ వ్యాపారంలో ఎలాంటి ప్రమాణాలు పాటించలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని, అయోధ్య అభివృద్ధి మండలి అక్రమంగా భూమిని కొనుగోలు చేసిన, విక్రయించిన, ప్లాట్లు చేసిన 40 మంది ఆస్తుల వ్యాపారుల జాబితాను విడుదల చేసింది. ఈ ఆస్తుల డీలర్ల జాబితాలో అయోధ్య సదర్‌ ఎమ్మెల్యే వేద్‌ ప్రకాశ్‌ గుప్తా, మేయర్‌ రిషికేశ్‌ ఉపాధ్యాయ, మిల్కీపూర్‌ మాజీ ఎమ్మెల్యే గోరఖ్‌నాథ్‌ బాబా పేర్లు కూడా ఉన్నాయి. అభివృద్ధి మండలి ఈ జాబితాను విడుదల చేయడంతో కలకలం రేగింది. ఇప్పుడు అధికారపక్షాన్ని చుట్టుముట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఫైజాబాద్‌ నగరంలోని తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూములు ప్లాట్లు చేసి విక్రయించారు. అక్కడ అక్రమంగా కాలనీలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రజలు భూములు కొని ఇళ్లు కట్టుకున్నారు. అయితే గత 15 రోజుల క్రితం ఆ ప్రాంతాన్ని ముంపు ప్రాంతంగా అభివృద్ది అధికార యంత్రాంగం ప్రకటించడం, బుల్డోజర్లతో ఇళ్లను కూల్చివేయడం కలకలం రేపింది. అనంతరం విచారణ ప్రారంభించగా ఈ ప్రాంతంలో వారు ఇళ్లు కట్టుకొని ఉన్నట్లు తెలిసింది.
ప్రభుత్వ శాఖ ద్వారా తొలగింపు చర్యను చేపట్టాయి. నగరపాలక సంస్థ నుంచి ఇంటి నంబర్‌ను మంజూరు చేసినట్లు తెలిసింది. అటువంటి పరిస్థితిలో ఈ భూ యజమానులు తమకు భూమిని స్వాధీనం చేసుకుని ఇల్లు నిర్మించుకునే హక్కు వచ్చినప్పుడు, తమ భూమి, ఇల్లు అక్రమమని ఎలా ప్రకటించారని వాదిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై దుమారం చెలరేగడంతో ప్రభుత్వం, పాలనా యంత్రాంగంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img