Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

భారత్‌కు పతక హారం

ఆఖరి రోజు స్వర్ణాలపంట

బ్మాడ్మింటన్‌లో సింధు, లక్ష్యసేన్‌
డబుల్స్‌లో స్వాత్విక్‌`చిరాగ్‌ జోడీ
టీటీ సింగిల్స్‌లో ఆచంట శరత్‌ కమల్‌
నిరాశపరచిన హాకీ జట్టు

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం పీవీ సింధు స్వర్ణం సాధించింది. దీంతో పతకాల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి ఎగబాకింది. తాజాగా బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగం ఫైనల్స్‌లో సింధు.. కెనడా క్రీడాకారిణి మిచెలీ లీని ఓడిరచింది. తొలి గేమ్‌లో 21-15తో నెగ్గిన సింధు రెండో గేమ్‌ను 21-13తో కైవసం చేసుకుంది. దీంతో వరుస గేమ్స్‌లో ఆధిపత్యం చెలాయించి భారత్‌కు మరో పసిడి అందించింది. కాగా, కామన్వెల్త్‌ క్రీడల్లో ఆమెకు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. అంతకుముందు 2014లో కాంస్యం గెలిచిన సింధు 2018లో రజతం సాధించింది.
తుదిపోరులో లక్ష్యసేన్‌ విజయం: కామన్వెల్త్‌ క్రీడల్లో పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌ విభాగంలో భారత షట్లర్‌ లక్ష్యసేన్‌ విజయం సాధించాడు. దీంతో అతడు స్వర్ణంతో మెరిశాడు. మలేషియాకు చెందిన జె యంగ్‌ ఎన్జీతో తలపడిన ఫైనల్స్‌లో లక్ష్యసేన్‌ 19-21, 21-9, 21-16 తేడాతో గెలుపొందాడు. తొలి గేమ్‌లో కాస్త వెనుకంజలో నిలిచిన లక్ష్యసేన్‌ చివరి రెండు గేమ్స్‌లోనూ పట్టుదలగా ఆడాడు. ప్రత్యర్థి గట్టి పోటీనిచ్చినా ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. దీంతో గొప్పగా పోరాడి భారత్‌కు మరో పసిడి అందించాడు.
బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ తన పతకాల వేట కొనసాగిస్తోంది. పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌, మహిళల సింగిల్స్‌లో స్వర్ణ పతకాలు సాధించగా.. తాజాగా పురుషుల డబుల్స్‌ విభాగంలోనూ భారత్‌ మరో స్వర్ణం అందుకుంది. రంకిరెడ్డి సాత్విక్‌-చిరాగ్‌ జోడీ సీన్‌-బెన్‌ ద్వయంతో 21-15, 21-13 తేడాతో విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకున్నారు.
టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌లో…
కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు ఆఖరి రోజున స్వర్ణాల పంట పండుతోంది. టేబుల్‌ టెన్నిస్‌ విభాగంలో ఆచంట శరత్‌ కమల్‌ స్వర్ణం సాధించాడు. ఇంగ్లండ్‌కు చెందిన లియామ్‌ పిచ్‌ఫోర్డ్‌ మీద 11-13, 11-7, 11-2, 11-6, 11-8తో శరత్‌ విజయం సాధించాడు. శరత్‌ తెచ్చిన పతకంతో సోమవారం నాటికి స్వర్ణాల సంఖ్య నాలుగుకి చేరింది. ఇదే పోటీల్లో భారత్‌ ఆటగాడు జ్ఞానశేఖరన్‌ సాతియాన్‌ కాంస్య పతక పోరులో పతకం సాధించాడు. ఇంగ్లండ్‌ ఆటగాడు పాల్‌ డ్రిరక్‌హాల్‌ను 119, 113, 115, 811, 911, 1012, 119 తేడాతో ఓటించి 43తో విజయం సాధించాడు.
హాకీ జట్టుకు రజతం
కామన్వెల్త్‌ క్రీడల్లో పసిడి వేటలో భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత హాకీ జట్టు రజతంతో సరిపెట్టుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 8-0 తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ మొత్తం 61 పతకాలు సాధించింది. అందులో 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img