Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Monday, September 9, 2024
Monday, September 9, 2024

ఉమ్మడిగా ముందుకు…

. కలిసి పోటీకి ప్రాథమిక అవగాహన
. ప్రజాసమస్యలపై ఐక్యపోరాటం
. పీసీసీ అధినేత్రితో సీపీఐ, సీపీఎం నేతల భేటీ
. బీజేపీకి వైసీపీ, టీడీపీ బానిసత్వం: షర్మిల
. బీజేపీ మతతత్వ రాజకీయాలు: రామకృష్ణ
. బీజేపీ, టీడీపీ, వైసీపీని ఓడిస్తాం: శ్రీనివాసరావు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: రాబోయే ఎన్నికల్లో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై వామపక్షాలతో కాంగ్రెస్‌ చర్చించింది. కాంగ్రెస్‌ నేతల ఆహ్వానం మేరకు శుక్రవారం విజయవాడ ఆంధ్రరత్నభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులు వైఎస్‌ షర్మిలను సీపీఐ, సీపీఎం నేతలు కలిశారు. ఇండియా కూటమిలో వామపక్షాలు భాగస్వాములుగా ఉండటంతో…ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడిరది. సీపీఐ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ వెళ్లారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఆ పార్టీ నేతలు ఎంఏ గఫూర్‌, వై.వెంకటేశ్వరావు హాజరయ్యారు. కాంగ్రెస్‌ పక్షాన షర్మిలతోపాటు ఆ పార్టీ నేతలు గిడుగు రుద్రరాజు, జేడీ శీలం తదితరులు హాజరై పొత్తులపై చర్చించారు. దేశ, రాష్ట్ర రాజకీయాలు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్ని రాజకీయ పరిణామాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం రామకృష్ణ, శ్రీనివాసరావు, షర్మిల విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా సమస్యలపై ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టారు. త్వరలోనే ఉమ్మడిగా రౌండ్‌టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేసి… భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించనున్నారు.
షర్మిల మాట్లాడుతూ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ…బీజేపీకి తొత్తులుగా మారి ఆంధ్రప్రదేశ్‌ హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. రాష్ట్ర హక్కుల కోసం కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతోందని, ఈ ప్రయాణంలో భాగంగా వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటున్నామన్నారు. కలిసి పోరాడే అంశంపై చర్చించామని, తాము ఐక్య పోరాటాలు చేస్తామని వెల్లడిరచారు. ఉమ్మడిగా ముందుకు సాగకపోతే ఈ పెద్ద పర్వతాలను ఢీకొనడం అసాధ్యమన్నారు. అనంతపురం సభకు సీపీఐ, సీపీఎం నేతలను ఆహ్వానించామని, సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయని వివరించారు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై త్వరలో స్పష్టత వస్తుందన్నారు. 2014లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రానికి పదేళ్ల ప్రత్యేక హోదా వచ్చేదని, పోలవరం పూర్తయ్యేదని చెప్పారు. హోదా సాధనలో జగన్‌, చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. ప్రత్యేక హోదాపై మోదీ తిరుపతిలో మాట ఇచ్చి…అధికారంలోకి వచ్చాక తప్పారని ఆరోపించారు.
కె.రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీ మతతత్వ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని మారుస్తారని మండిపడ్డారు. దేశం అత్యంత ప్రమాదంలో ఉందని, ప్రధానమైన ప్రాంతీయ పార్టీలు బీజేపీకి భయపడుతున్నాయని చెప్పారు. ప్రధాని మోదీకి జగన్‌, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ దాసోహమంటున్నారని విమర్శించారు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారన్నారు. బీజేపీని, వైసీపీని ఓడిరచడానికి ఇతర ప్రజాతంత్ర పార్టీలనూ కూడగడతామన్నారు. జగన్‌ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని, ప్రజలను బిచ్చగాళ్లను చేశారని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు. మెగా డీఎస్సీ కోసం ఆందోళన చేసిన షర్మిలను అరెస్టు చేయడం దారుణమన్నారు.
వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీ ఏపీకి తీరని ద్రోహం చేసిందని, బీజేపీ, వైసీపీ, టీడీపీపైనే తమ పోరాటమని స్పష్టంచేశారు. ఈ పార్టీలు రాష్ట్రాన్ని ఘోరంగా మోసగించాయన్నారు. ఒక్క శాతం ఓట్లు లేని బీజేపీ రాష్ట్రాన్ని శాసిస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీపై దుమ్మెత్తి పోసిన చంద్రబాబు ఇప్పుడు పొర్లుదండాలు పెడుతున్నారని విమర్శించారు. బీజేపీ ముఖ్యమంత్రులు కూడా ఇన్నిసార్లు దిల్లీ చుట్టూ తిరగడం లేదని, ఎన్నిసార్లు తిరిగినా ఒక్క హామీ అమలుకు నోచుకోలేదని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ సహకారం తీసుకుంటామని, అందరం కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. బీజేపీని, దానికి కమ్ముగాసే పార్టీలను సాగనంపుతామని స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img