Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ముర్ముకే పట్టం

168 శాతానికిపైగా ఓట్లతో విజయం
25న ప్రమాణస్వీకారం

న్యూదిల్లీ : భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. ఈ పదవిని అధిష్ఠించిన తొలి ఆదివాసీ మహిళగా ఆమె చరిత్రకెక్కారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం ఈనెల 24వ తేదీతో ముగియనుంది. దీంతో ఆమె 25న రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె..68శాతానికి పైగా ఓట్లతో విజయం సాధించారు. ఆమె ప్రత్యర్థి, విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌సిన్హాకు 32 శాతం ఓట్లు లభించాయి. ఆమెకు ఎంపీలతో పాటు 10రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్లు 4,83,299 రాగా, యశ్వంత్‌ సిన్హాకు 1,89,876 ఓట్లు వచ్చాయి. మూడవ రౌండులో 1,333 ఓట్లు రాగా వాటి విలువ 1,65,664. ముర్ముకు 812 ఓట్లు, యశ్వంత్‌ సిన్హాకు 521 ఓట్లు వచ్చాయి. మూడవ రౌండు ముగిసే సరికి 3,219 ఓట్లు పోలు కాగా వాటి మొత్తం విలువ 8,38,839 అని, అందులో ముర్ముకు 5,77,777 విలువ చేసే 2,161 ఓట్లు వచ్చాయని, సిన్హాకు 2,61,062 విలువచేసే 1,058 ఓట్లు వచ్చాయని రిటర్నింగ్‌ అధికారి పీసీ మోదీ తెలిపారు. 17 మంది విపక్ష ఎంపీలు ముర్ముకు అనుకూలంగా ఓటు వేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 15 ఎంపీ ఓట్లు చెల్లనివిగా ఉన్నట్లు చెప్పిన మోదీ ఆ తర్వాత అన్ని ఓట్లను లెక్కించినట్లు తెలిపారు. ఎనిమిది మంది ఎంపీలు ఓటు వేయలేదని చెప్పారు. ఎంపీల ఓట్లలో ముర్ముకు 540 ఓట్లు పోలయ్యాయి. ఆమెకు పోలైన ఓట్ల విలువ 3,78,000గా ఉందని పీసీ మోదీ తెలిపారు. యశ్వంత్‌ సిన్హాకు 208 ఓట్లు పోల్‌ కాగా ఆయనకు లభించిన ఓట్ల విలువ 1,45,600గా ఉందన్నారు. ప్రస్తుత ఎన్నికలో ఒక్కో ఎంపీ ఓటు విలువ 700గా నిర్ణయించారు. ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు తర్వాత ద్రౌపది ముర్ముకు మరింత ఆధిక్యం దక్కింది. 10 రాష్ట్రాల్లోని మొత్తం 1138 మంది ఎమ్మెల్యేలలో 809 మంది ఓట్లను ముర్ము పొందగా 1,05,299 ఓటు విలువ లభించింది. యశ్వంత్‌ సిన్హా .. 329 ఎమ్మెల్యేల ఓటుతో 44,276 ఓటు విలువను సాధించారు. ముర్ముకు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఓట్లు లభించాయి. ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోం, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, గోవా, గుజరాత్‌, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల ఓట్లు లెక్కింపు పూర్తి కాగా 809 మంది ఎమ్మెల్యేల ఓట్లను ముర్ము దక్కించుకున్నారు.
ప్రధాని శుభాకాంక్షలు: రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, ప్రహ్లాద్‌ జోషి, పీయూష్‌ గోయల్‌
శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img