Friday, December 1, 2023
Friday, December 1, 2023

చంద్రబాబు పేరుతో విడుదలైన ఫేక్ లెటర్ ను షేర్ చేసిన నారా లోకేశ్

సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోలేని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ప్రతి రోజూ ఎన్నో ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సంతకంతో ఉన్న ఒక ఫేక్ లెటర్ చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యలో టీడీపీ యువనేత నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. కుల, మత, ప్రాంత విభేదాలతో రెచ్చగొడుతూ పైశాచిక ఆనందం పొందే సైకో జగన్ కిరాయి మనుషులు చంద్రబాబు పేరుతో ఒక ఫేక్ లెటర్ వదిలారని ఆయన మండిపడ్డారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన వైసీపీ ఫేక్ ఎత్తుగడల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైరల్ అవుతున్న ఫేక్ లెటర్ ను షేర్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img