Sunday, October 1, 2023
Sunday, October 1, 2023

ఎఫ్‌ఐఆర్‌ నమోదుకూ తీరికలేదా?

. అంటే రాజ్యాంగ యంత్రాంగం, శాంతిభద్రతలు కుప్పకూలినట్టేగా!
. మణిపూర్‌ ప్రభుత్వ, పోలీసు యంత్రాంగానికి సుప్రీం మొట్టికాయలు
. నత్తనడక దర్యాప్తు అలసత్వానికి నిదర్శనమని వ్యాఖ్య
. 7న కోర్టుకు హాజరు కావాలని డీఐజీకి ఆదేశాలు
. ఎఫ్‌ఐఆర్‌లునిందితులుఅరెస్టులపై వివరాలు కోరిన న్యాయస్థానం

న్యూదిల్లీ : హింస నేపథ్య కేసుల్లో దర్యాప్తు నత్తనడకన సాగుతుండటం, ఇప్పటివరకు అరకొర అరెస్టులు జరగడం, అమానుషాలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుకూ తీవ్ర జాప్యం జరగడాన్ని బట్టి ఈశాన్య రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం, శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో కుప్పకూలినట్లు స్పష్టమవుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పోలీసు యంత్రాం గం అలసత్వానికి, అధికారుల్లోని బద్దకానికి కేసుల విచారణ తీరు అద్దంపడుతోందని మొట్టికాయలు వేసింది. ఇప్పటివరకు నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు, నిందితుల సంఖ్య, జరిగిన అరెస్టులు, అరెస్టుల దిశగా చేపట్టే చర్యలు తదితర వివరాలను మణిపూర్‌ పోలీసుల నుంచి సర్వోన్నత న్యాయ స్థానం కోరింది. ఇందుకోసం ఈనెల 7న కోర్టు ఎదుట హాజరు కావాలని మణిపూర్‌ డీఐజీకి త్రిసభ్య ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్‌లో కుకీ, మయితె వర్గీయుల మధ్య ఘర్షణ, హింస, మహిళలపై దురాగతాలతో రాజ్యాంగబద్ధ యంత్రాంగం పూర్తిగా కుప్ప కూలిపోగా, కేసుల విచారణ, చర్యలు తీసుకోవ డంలో పోలీసుల వైఫల్యాలపై తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డీజీపీకి ఆదేశాలిచ్చింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కోర్టు ఎదుట హాజరు కావాలని సీజేఐ చంద్రచూడ్‌ నేతృత్వ జస్టిస్‌ జేబీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలి చ్చింది. ఇద్దరు మహిళలను వివస్త్రలను చేసి ఊరేగించడం, వారిపై అత్యాచారాలు జరగడం వంటి భాయానక ఘటన జరిగిన రోజు నమోదు చేసిన జీరో ఎఫ్‌ఐఆర్‌తో పాటు సాధారణ ఎఫ్‌ఐఆర్‌ వివరాలను కోరింది. ఇప్పటివరకు నమోదైన ఆరువేలకుపైగా ఎఫ్‌ఐఆర్‌లలో ఎంత మంది నిందితులు ఉన్నారు? వారి అరెస్టుకు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img