Monday, September 25, 2023
Monday, September 25, 2023

ఎన్టీఆర్ స్మారక రూ. 100 నాణేల అమ్మకాలు ప్రారంభం

హైదరాబాద్ లోని సైఫాబాద్, చర్లపల్లిలోని మింట్ విక్రయ కేంద్రాల్లో అమ్మకాలు
భారత ప్రభుత్వ మింట్ వెబ్ సైట్లో ఆన్ లైన్ లో కొనుగోలు చేసే అవకాశం


దివంగత ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకుని కేంద్ర ఆర్థిక శాఖ రూ. 100 స్మారక నాణేన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నిన్న నాణెం విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ నాణెం ఈ ఉదయం 10 గంటల నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.భారత ప్రభుత్వ మింట్ వెబ్ సైట్ లోని వెళ్లి ఆన్ లైన్ లో కొనుగోలు చేయవచ్చు. మరోవైపు హైదరాబాద్ లోని సైఫాబాద్, చర్లపల్లిలోని మింట్ విక్రయ కేంద్రాల్లోని విక్రయ కేంద్రాల్లో నేరుగా కొనుక్కోవచ్చు. ఇంకోవైపు ఎన్టీఆర్ స్మారక నాణేలకు మూడు ధరలను నిర్ణయించారు. చెక్క డబ్బాలో ఉన్న నాణెం ధర రూ. 4,850… ప్రూఫ్ ఫోల్డర్ ప్యాక్ లో ఉన్న నాణెం ధర రూ. 4,380… యూఎన్సీ ఫోల్డర్ ప్యాక్ లో ఉన్న నాణెం ధర రూ. 4,050గా నిర్ణయించారు. ఈ నాణేలను 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం జింక్, 5 శాతం నికెల్ మిశ్రమంతో తయారు చేశారు. ఈ మెటల్ కాంబినేషన్ వల్ల నాణెం ఎప్పటికీ మెరుస్తూనే ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img