Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎన్వీఎస్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతం

నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ రాకెట్..శ్రీహరికోట అంతరిక్షకేంద్రం నుంచి ప్రయోగం చేపట్టిన ఇస్రో
స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటులో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మరో ప్రయోగం విజయవంతమైంది. సోమవారం ఉదయం ఎన్వీఎస్-01 ఉపగ్రహం విజయవంతంగా కక్ష్యలోకి చేరింది. భారతదేశానికి చెందిన రెండో తరం నావిక్ ఉపగ్రహాల్లో మొదటిదైన ఎన్వీఎస్-01 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. తాజా ప్రయోగంతో భారత భూభాగం చుట్టూ 1500 కిలోమీటర్ల పరిధిలో రియల్ టైమ్ పొజిషనింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని ఇస్రో చైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు. కాగా, జీఎస్ఎల్వీ-ఎఫ్ 12 రాకెట్ పొడవు 51.7 మీటర్లు, బరువు 420 టన్నులు కాగా, ఎన్వీఎస్-01 ఉపగ్రహం బరువు 2,232 కిలోలు. ఉపగ్రహం జీవిత కాలం 12 సంవత్సరాలు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img