రేపు ఆదివారం కావడంతో ఈరోజే పింఛన్ల పంపిణీ
సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్ల పంపిణీ
ప్రతి నెల ఒకటో తేదీనే పింఛన్లు, జీతాలను ఇవ్వాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్టుగానే పింఛన్లు, జీతాలను ఇస్తోంది. అయితే సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడంతో… పింఛన్లను ఒక రోజు ముందుగానే అంటే ఈరోజున పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించినట్టుగానే ఈ ఉదయం నుంచి పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది. ఉదయం నుంచే వేగంగా పింఛన్లను అందజేస్తున్నారు. ఈరోజు ఇప్పటి వరకు 56 శాతం పింఛన్ల పంపిణీ పూర్తయింది. సచివాలయ సిబ్బంది ద్వారా పింఛన్ల పంపిణీ జరుగుతోంది. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో మాత్రం పింఛన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగడం లేదు.