Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

విపక్ష కూటమి ఇండియా

. బీజేపీని ఓడిరచే లక్ష్యంగా అడుగులు
. 11 మందితో సమన్వయ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం
. తదుపరి సమావేశం ముంబైలో
. ప్రచార నిర్వహణకు దిల్లీలో ఉమ్మడి సెక్రటేరియట్‌
. ప్రత్యేక సమస్యలపై నిర్దిష్ట కమిటీలు

న్యూదిల్లీ : కేంద్రంలో అధికార బీజేపీని ఓడిరచడమే లక్ష్యంగా విపక్షాలు ముందడుగు వేశాయి. ఉమ్మడి వ్యూహం రూపొందించేందుకు, కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసేందుకు కసరత్తు ప్రారంభించాయి. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సామాజిక న్యాయం పరిరక్షణే ధ్యేయంగా దేశంలోని అన్ని లౌకిక పార్టీలు విభేదాలను పక్కనబెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని నిశ్చయించాయి. భారతదేశ ఐక్యతను పరిరక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాయి. సోమవారం బెంగళూరులో ఉమ్మడి అజెండా ఖరారుతో ప్రారంభమైన 26 ప్రతిపక్ష పార్టీల సమావేశం రెండవ రోజు మంగళవారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా అనేక నిర్ణయాలు, తీర్మానాలు చేయడంతో సమావేశం ముగిసింది. దాదాపు నాలుగు గంటలపాటు జరిగిన 26 పార్టీల సమావేశం అనంతరం విపక్ష నేతలంతా సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే మాట్లాడుతూ 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్‌డీఏతో తలపడే ప్రతిపక్ష కూటమిని ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయన్స్‌ (ఇండియా)గా పిలుస్తామని ప్రకటించారు. ఈ పేరును 26 పార్టీలు అంగీకరించాయని అన్నారు. సమన్వయం కోసం 11 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ తాము భావజాలం, కార్యక్రమాల గురించి మాట్లాడే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ‘బీజేపీ భావజాలం, వారి ఆలోచనలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. వారు దేశంపై దాడి చేస్తున్నారు. నిరుద్యోగం ప్రబలంగా ఉంది. దేశ సంపద లక్షలాది మంది ప్రజలను లాక్కొని, కొంతమంది చేతుల్లో అప్పగిస్తున్నారు’ అని అన్నారు. మల్లికార్జున ఖడ్గే మాట్లాడుతూ దేశ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రతిపక్ష కూటమి రెండో సమావేశం చాలా ముఖ్యమైనదన్నారు. ‘మేము ఐక్యంగా వివిధ అంశాలపై చర్చించాము. ఈరోజు ఆమోదించిన తీర్మానానికి ప్రజలు ఒకే గొంతుకతో మద్దతు తెలిపారు. మా కూటమిని ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయన్స్‌ (ఇండియా) అని పిలుస్తామన్నారు. అయితే ఈ పేరును టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించారని, ఈ పదం పూర్తి రూపం… ఇండియాపై చాలా చర్చలు జరిగాయని ఆ వర్గాలు తెలిపాయి. కాగా, 11 మంది సభ్యులతో కూడిన సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని, ముంబైలో జరిగే తదుపరి సమావేశంలో దాని కూర్పును ఖరారు చేస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు చెప్పారు. కూటమి ప్రచార నిర్వహణ కోసం దిల్లీలో సచివాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని, ప్రత్యేక సమస్యల కోసం నిర్దిష్ట కమిటీలను ఏర్పాటు చేస్తామని ఖడ్గే వివరించారు. ముంబై సమావేశానికి సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఆయన విరుచుకుపడుతూ, చీలిపోయిన పార్టీలను ఇప్పుడు ఏకతాటిపైకి తెచ్చేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని, దీన్నిబట్టి ఆయన ప్రతిపక్ష పార్టీలకు భయపడుతున్నట్లు తెలుస్తోందన్నారు. ‘మా మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి. కానీ మేము దానిని వెనుకకు ఉంచాము. మేము దేశ ప్రయోజనాల కోసం కలిసి ఉన్నాము’ అని ఖడ్గే అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి విజయం సాధిస్తామని తెలిపారు. విలేకరులతో బెనర్జీ మాట్లాడుతూ రాహుల్‌ గాంధీని ‘మా అభిమానం’ అని అన్నారు. ఆమోదించిన కూటమి పేరును ప్రస్తావిస్తూ ‘బీజేపీ, మీరు భారతదేశాన్ని సవాలు చేయగలరా? మేము మా మాతృభూమిని ప్రేమిస్తున్నాము, మేము దేశానికి చెందిన దేశ భక్తులం, మేము రైతుల కోసం, దళితుల కోసం, మేము దేశం కోసం, ప్రపంచం కోసం’ అని అన్నారు. నేడు కేంద్రంలోని ప్రభుత్వం చేస్తున్న ఏకైక పని ప్రభుత్వాలను కొనడం, అమ్మడం అని ఆమె ఆరోపించారు. ‘భారతదేశం గెలుస్తుంది. మన దేశం గెలుస్తుంది. బీజేపీ ఓడిపోతుంది’ అని బెనర్జీ అన్నారు. రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ ఈ పోరాటం ప్రతిపక్ష పార్టీలకు, బీజేపీకి మధ్య కాదని, ‘ఇది భారతదేశంపై దాడికి గురవుతున్న ఆలోచన కోసం పోరాటం’ అని రాహుల్‌ గాంధీ అన్నారు. ‘అందుకే ఈ పేరును ఎంచుకున్నారు. బీజేపీ, భారతదేశం మధ్య, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భారతదేశం మధ్య, వారి (బీజేపీ) సిద్ధాంతం, భారతదేశం మధ్య పోరు. ఎవరైనా భారతదేశానికి వ్యతిరేకంగా నిలబడితే ఏమి జరుగుతుందో మీకు తెలుసు, ఎవరు గెలుస్తారు’ అని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు అన్నారు. ‘మేము (ప్రతిపక్ష పార్టీలు) భారత రాజ్యాంగాన్ని, ప్రజల గొంతును, మన గొప్ప దేశం ఐక్యతను పరిరక్షిస్తున్నాము. భారతదేశం ఐక్యతతో పోరాడే వారికి ఏమి జరుగుతుందో మీకు తెలుసు. ఇది బీజేపీ, భారతదేశం ఐక్యత మధ్య పోరు’ అని గాంధీ అన్నారు. ఇదిలాఉండగా, ఈ కూటమికి ఎవరు నేతృత్వం వహిస్తారని ప్రశ్నిస్తే, ఖడ్గే నేరుగా సమాధానం ఇవ్వలేదు. సమన్వయ కమిటీ, కన్వీనర్‌ పేరు కూడా ఉంటుందని అన్నారు. దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ తొమ్మిదేళ్లలో దేశానికి చాలా చేసే అవకాశం ప్రధాని మోదీకి వచ్చిందని, అయితే ఏ రంగంలోనూ అభివృద్ధి జరగలేదన్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడుతూ భావజాలంలో భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కానీ దేశమే ప్రధానమని అన్నారు. బీజేపీపై విరుచుకుపడిన ఆయన… ‘మేము కుటుంబం కోసం పోరాడుతున్నాం’ అని కొందరు అంటున్నారని, ‘దేశం మన కుటుంబం, మనం మన దేశం కోసం పోరాడుతున్నాం’ అని తెలుసుకోవాలని అన్నారు. ప్రతిపక్ష పార్టీల పోరాటం ఒక వ్యక్తిపై కాదని, ‘నియంతృత్వానికి’ వ్యతిరేకంగా ఉందని నొక్కి చెప్పారు. ‘ఏమి జరుగుతుందోనని ప్రజలు భయపడుతున్నారని అన్నారు. ఒక వ్యక్తి, ఒక పార్టీ దేశం కాదని ఠాక్రే తెలిపారు. అనంతరం కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ ట్వీట్‌ చేస్తూ, ‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 1. భారతదేశం, అంటే భారత్‌, రాష్ట్రాల యూనియన్‌గా ఉండాలి. ఈరోజు బెంగళూరులో 26 ప్రతిపక్ష పార్టీలు ప్రకటించిన భారతదేశం వెనుక ఉన్న స్ఫూర్తి ఇదే’ అని పేర్కొన్నారు. శరద్‌ పవార్‌తో సహా చాలా మంది నాయకులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అయితే బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్‌, బీహార్‌, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ విమానం ఎక్కవలసి ఉన్నందున విలేకరుల సమావేశానికి ముందే వెళ్లిపోయారు. కాంగ్రెస్‌, టీఎంసీ, డీఎంకే, ఆప్‌, జేడీ(యూ), ఆర్‌జేడీ, జేఎంఎం, ఎన్‌సీపీ (శరద్‌ పవార్‌), శివసేన (యూబీటీ), ఎస్‌పీ, ఎన్‌సీ, పీడీపీ, సీపీఐ, సీపీఎం, ఆర్‌ఎల్‌డీ, ఎండీఎంకే, కొంగునాడు మక్కల్‌ దేశాయ్‌ కట్చి (కేఎండీకే), వీసీకే, ఆర్‌ఎస్‌పీ, సీపీఐ(ఎంఎల్‌)`లిబరేషన్‌, ఫార్వార్డ్‌ బ్లాక్‌, ఐయూఎంఎల్‌, కేరళ కాంగ్రెస్‌ (జోసెఫ్‌), కేరళ కాంగ్రెస్‌ (మణి), అప్నా దళ్‌ (కామెరవాడి), మనితనేయ మక్కల్‌ కట్చి (ఎంఎంకే) ఈ సమావేశానికి హాజరయ్యాయి. సోనియా గాంధీ, తమిళనాడు, జార్ఖండ్‌ ముఖ్యమంత్రులతో పాటు ఉత్తర ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌, అనేక పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. లోక్‌సభలో ఈ 26 పార్టీలు దాదాపు 150 సీట్ల బలం ఉంది.
ఉమ్మడి తీర్మానం ఆమోదం
సమావేశం అనంతరం విడుదల చేసిన తమ ‘సామూహిక సంకల్ప్‌ (ఉమ్మడి తీర్మానం)’ లో, ప్రతిపక్ష పార్టీలు కుల గణనను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ, ‘మహిళలు, దళితులు, గిరిజనులు, కశ్మీర్‌ పండిట్లపై పెరుగుతున్న నేరాలు, మైనారిటీలపై జరుగుతున్న ‘ద్వేషం, హింసను’ ఓడిరచేందుకు తాము కలిసి వచ్చామని పేర్కొంది. మణిపూర్‌ను ‘నాశనం’ చేసిన ‘మానవతా విషాదం’పై వారు తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేశారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img